కోర మీసాల మహేష్.. మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్
సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ జర్నీ ఆసక్తికరంగా సాగుతోంది. విలక్షణ పాత్రలు, విభిన్న కథాంశాలతో సాగిపోతున్న మహేష్ బాబు ఇటీవలే తన 25 సినిమా పూర్తిచేశాడు. వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో రూపొందిన మహేష్ 25 వ సినిమా మహర్షి ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తూ రికార్డులు తిరగరాసింది. గతంలో భరత్ అనే నేను, ఇప్పుడు మహర్షి రూపంలో రెండు భారీ హిట్లు ఆయన ఖాతాలో పడటంతో మహేష్ హాట్రిక్ మూవీపై పడింది సినీ లోకం కన్ను.
మహేష్ 26 గా రాబోతున్న ఆయన తదుపరి సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంది. మహేష్ సరసన క్రేజీ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. అలాగే ఈ సినిమా ద్వారానే సీనియర్ హీరోయిన్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ పూర్తిచేసిన మహేష్ మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా స్టెన్ పైకి రానున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో మహేష్ లుక్ ఎలా ఉండనుందనే ఓ వార్త ఆయన అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడని ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించారు. అయితే తాజాగా మహేష్ లుక్ విషయమై మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు రావడం ప్రేక్షకుల్లో ఆసక్తి నింపింది. పాత్ర డిమాండ్ మేర మహేశ్ కొత్త లుక్‌లో కనిపిస్తాడని సినీ వర్గాల టాక్. ఫిలిం నగర్ నుంచి అందిన సమాచారం మేరకు మహేష్ ఈ సినిమాలో కోరమీసాలతో, మిలటరీ కటింగ్ తో అట్రాక్టివ్ గా కనిపిస్తాడని తెలిసింది. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలో నైనా ఇట్టే ఒదిగిపోయే మహేష్‌ని మిలిటరీ ఆఫీసర్‌గా ఈ లుక్ లో చూడాలని ఆతృతగా ఉన్నారు ఆయన అభిమానులు.


Click it and Unblock the Notifications











