ఇంట్రెస్టింగ్.. వచ్చే నెలలో రామ్ చరణ్ 'రంగస్థలం' విడుదల

రంగస్థలం సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. తెలుగు సూపర్ హిట్ సాధించిన రంగస్థలం సినిమాను ఇతర భాషల్లోకి అనువదించి రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు కన్నడ భాషలో రంగస్థలం మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. జులై 12 వ తేదీన కన్నడ రంగస్థలం విడుదల కానుంది.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సినిమాలకు తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఈయన నటించిన హిట్ సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే రంగస్థలం సినిమాను కన్నడ వర్షన్ లో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఒరిజినల్ వర్షన్ లో నటించిన రామ్ చరణ్, సమంతలే కన్నడ ప్రేక్షకులను అలరించబోతున్నారు.

Intresting Update On Ram Charans Rangasthalam

తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది రంగస్థలం సినిమా. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. కలెక్షన్ల సునామీ సృష్టించి నిర్మాతలకు లాభాల;ఆ పంట పండించింది. దీన్ని క్యాచ్ చేస్తూ రంగస్థలం సినిమాను ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోనూ విడుదల చేయాలని ఫిక్సయ్యారు. ఈ నేపథ్యంలో మళయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. కన్నడ వర్షన్ రిలీజ్ జులై 12 న ఫిక్స్ చేశారు. మలయాళీ వర్షన్ రిలీజ్ డేట్ తెలియాల్సి ఉంది. 'రంగస్థలం' సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిన రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన.. ఈ సినిమా అనువాద వర్షన్లకు కూడా ప్రమోషన్స్ చేస్తుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X