బ్రేకింగ్: రామ్ గోపాల్ వర్మ బయోపిక్‌కి సర్వం సిద్ధం! ఆయన లైఫ్ అంతా..

గత కొంతకాలంగా ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య అగ్గిరాజుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం చూశాం. ఈ నేపథ్యంలోనే వర్మపై బయోపిక్ తీస్తానని ప్రకటించారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. పైగా దానికి ''పప్పు వర్మ'' అనే టైటిల్ పెడతానని ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ఇందుకు సంబంధించి మరో అప్‌డేట్ తెలిసింది. వివరాల్లోకి పోతే..

పప్పు వర్మ అప్‌డేట్.. వెరీ ఇంట్రెస్టింగ్

పప్పు వర్మ అప్‌డేట్.. వెరీ ఇంట్రెస్టింగ్

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా అప్‌డేట్స్ ద్వారా సినీ, రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై నిరసనలు రేకెత్తడం, కోర్టు కేసులు పడటం, ఆ తర్వాత సినిమా విడుదల సైతం ఆగిపోవడం జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వదిలిన 'పప్పు వర్మ' అప్‌డేట్ జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

సెట్స్ పైకి రామ్ గోపాల్ వర్మ బయోపిక్

సెట్స్ పైకి రామ్ గోపాల్ వర్మ బయోపిక్

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.. రామ్ గోపాల్ వర్మ బయోపిక్ కోసం సర్వం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో వర్మగా నటించనున్న నటుడు కూడా దొరికేశాడనేది తాజా సమాచారం. అతను అచ్చం వర్మ పోలికలతోనే ఉంటాడని తెలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు అతిత్వరలో రామ్ గోపాల్ వర్మ బయోపిక్ సెట్స్ పైకి రానుందనే సమాచారం వైరల్ అవుతోంది.

అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్మ లైఫ్

అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్మ లైఫ్

ఇక ఈ బయోపిక్‌లో.. శివ సినిమాకు ముందు నుంచి నేటివరకు వర్మ లైఫ్ ఎలా ఉంది? ఎక్కడెక్కడ టర్న్స్ తీసుకుంది? వర్మ చేసిన పనులేంటి? ఇతరత్రా అంశాలన్నీ చూపిస్తారని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ జీవితం మొత్తాన్ని ప్రేక్షకుల ముందుంచనున్నారట జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

వర్మపై జొన్నవిత్తుల సెటైర్స్

వర్మపై జొన్నవిత్తుల సెటైర్స్

గతంలో చాలా సందర్భాల్లో వర్మపై సెటైర్స్ వేశారు జొన్నవిత్తుల. జొన్నవిత్తులపై వర్మ ట్వీట్స్ చేయడం, దానికి జొన్నవిత్తుల రియాక్ట్ అవుతూ మండిపడటం చూశాం. ఈ నేపథ్యంలోనే ‘పప్పు వర్మ' అంటూ తానూ ఓ సినిమా తీస్తానని, అది వర్మ బయోపిక్ అని ప్రకటించారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

జనాల్లో ఆసక్తి.. వర్మ రియాక్ట్ అవుతాడా మరి!

జనాల్లో ఆసక్తి.. వర్మ రియాక్ట్ అవుతాడా మరి!

సాధారణంగా రామ్ గోపాల్ వర్మ విషయాలంటేనే జనాల్లో ఓ రకమైన ఆసక్తి ఉంటుంది. అలాంటిది రామ్ గోపాల్ వర్మ బయోపిక్ వస్తుందంటే ఇక జనం ఆగుతారా? వారిలో ఆసక్తికి రెక్కలు రాకుండా ఉంటాయా? సరిగ్గా అదే జరుగుతోంది. వర్మ బయోపిక్ అనే అంశం జనాల్లో ఆసక్తిని బాగా పెంచేసింది. మరి ఈ అంశంపై వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Recommended Video

#CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గురించి..

ప్రముఖ తెలుగు కవి, మరియు ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. సుమారు 600కి పైగా పాటలు రాశాడు. తెలుగు అధికార భాషా సంఘ మాజీ సభ్యుడు. పేరడీలు పాటలు రాయడంలో ప్రసిద్ధుడు. 2005లో రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా ''పెళ్ళాం పిచ్చోడు'' అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X