twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు సాయిపల్లవి.. ఇప్పుడు నాగచైతన్య.. శేఖర్ కమ్ముల సరికొత్త ప్రయోగం

    |

    యువ సామ్రాట్ అక్కినేని నాగచైత్య, హిట్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో కొత్త సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని లాంఛనంగా ప్రారంభమైంది. 'ఫిదా' సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఈ సినిమా కోసం మంచి స్క్రిప్ట్ రెడీ చేశారట. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది.

    గతంలో ఫిదా సినిమాలో సాయి పల్లవితో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పించారు శేఖర్ కమ్ముల. అచ్చమైన తెలంగాణ యాసలో ఆమె చెప్పిన ముద్దు ముద్దు మాటలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. అదే ప్రయోగాన్ని ఈ సినిమాలో కూడా చేయాలని నిర్ణయించారట శేఖర్ కమ్ముల. కాకపోతే ఇందులో సాయి పల్లవికి బదులుగా నాగచైతన్యతో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పించాలని శేఖర్ కమ్ముల డిసైడ్ అయ్యారట. ఈ మేరకు నాగచైతన్యకు తెలంగాణ యాసపై ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారని తెలుస్తోంది. నాగచైతన్య కూడా ఈ అంశమై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారని ఫిలిం నగర్ టాక్.

    Intresting Update On Sekhar Kammulas New Movie

    నాగచైతన్య కెరీర్ లో 20 సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మర్షియల్ హంగులు, భారీ యాక్షన్ సీన్లు, పెద్ద హీరోల జోలికి పోకుండా తనదైన శైలిలో అలరించే శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ రేడే చేసుకున్నారట. ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి జోడీని మరింత నాచురల్‌గా చూపించాలని శేఖర్ కమ్ముల ప్లాన్‌ చేస్తున్నారట. మరి కొద్ది రోజుల్లో సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.

    English summary
    Sai Pallavi played a role with Naga Chaitanya up coming movie which is directed by Sekhar Kammula. In this movie Naga Chaitanya will play different role. This movie more Official Statements will release soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X