బన్నీ- త్రివిక్రమ్ మూవీ.. మరో ఆసక్తికర అప్‌డేట్

అటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భారీ హిట్ కొట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత సినిమాల పరంగా 'నా పేరు సూర్య' రూపంలో బన్నీ డిసాస్టర్ మూగట్టుకోగా, 'అరవింద సమేత' రూపంలో అనుకున్న రేంజ్‌లో హిట్ సాధించలేక పోయాడు త్రివిక్రమ్. దీంతో ఈ ఇద్దరూ కలిసి భారీ ప్రాజెక్టుకు పూనుకున్నారు. అల్లు కెరీర్ లో 19వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

కాగా తాజాగా ఈ చిత్రానికి సంబందించిన మరో అప్డేట్ బయటకు చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఈ చిత్రానికి బాణీలు కట్టనున్న తాను అందుకు సంబందించిన పనులు మొదలు పెట్టేశానని పేర్కొంటూ ట్వీట్ పెట్టారు. ''#AA19 మ్యూజిక్ అందించే ప్రాసెస్ లో ఉన్నాం. మాస్టర్ ఆఫ్ రైటింగ్ త్రివిక్రమ్ సర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్'' అని ట్యాగ్ చేస్తూ బన్నీ, త్రివిక్రమ్ లతో కలిసి దిగిన పిక్ షేర్ చేశాడు. బన్నీ- త్రివిక్రమ్ అప్‌డేట్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్న మెగా అభిమానుల్లో ఈ ట్వీట్ జోష్ నింపింది.

Intresting Update On Trivikrams #AA19

గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇద్దరితో కలిసి పనిచేసిన అనుభవం థమన్‌కి ఉంది. అల్లు అర్జున్, థమన్ కాంబినేషన్ లో మ్యూజికల్ హిట్స్ రేసు గుర్రం, సరైనోడు వచ్చాయి. అలాగే త్రివిక్రమ్ గత సినిమా 'అరవింద సమేత' కు కూడా థమనే మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కూడా సంగీతం పరంగా భేష్ అనిపించుకుంది. ఎలా చూసినా సక్సెస్ ఫుల్ జోడీ కావడంతో ఈ సారి అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాలో బాణీలు హోరెత్తనున్నాయని అర్థమవుతోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న #AA 19 సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో బన్నీ సరసన అందాల భామ పూజా హెగ్డే చిందులేస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇంకా ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్, మరో హీరోయిన్ నివేద పేతురేజ్ కూడా భాగం కానున్నారని ఇటీవలే ప్రకటన రావడంతో ప్రేక్షకలోకంలో ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X