Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Introducing Pushpa Raj: విశ్వరూపం చూపించిన అల్లు అర్జున్.. తగ్గదెలే.. బాక్సాఫీస్‌కు మరో హెచ్చరిక!
తెలుగులో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన పుష్పపై రోజురోజుకు అంచనాలు అకాశాన్ని దాటేస్తున్నాయి. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా సినిమాకు సంబంధించిన పుష్పరాజ్ పరిచయ టీజర్ వచ్చేసింది. ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు మరో లెవెల్ కు చేరుకున్నాయి.
మైండ్ బ్లోయింగ్ పుష్ప రాజ్
ఈ సినిమా కోసం నిర్మాతలు అంచనాలకు మించి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్య, ఆర్య 2 వంటి రోమాంటిక్ లవ్ స్టోరీస్ అనంతరం బన్నీ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా అనగానే ఏదైనా లవ్ స్టోరీతో రావచ్చని అనుకున్నారు. కానీ ఊహలకందని రేంజ్ లో ఊర మాస్ కథను సెట్స్ పైకి తెచ్చారు. ఇక పుష్పరాజ్ లక్కు చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది.
తగ్గేదెలే..
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా అని ముందే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక టీజర్ లో ఆ విషయాన్ని అర్థమయ్యేలా మరోసారి చూపించారు. బన్నీ పుష్ప రాజ్ లుక్కుతోనే సరికొత్త కిక్కిచ్చాడు. తగ్గేదెలే.. అనే సింగిల్ డైలాగ్ తో బాక్సాఫీస్ కు హెచ్చరిక పంపినట్లు అర్థమవుతోంది.
హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్
యాక్షన్ తోనే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. దానికి తోడు దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవెల్లో ఉంది. ఇక సుకుమార్ మేకింగ్ ఈసారి మరింత కొత్తగా ఉండబోతున్నట్లు ఈ పరిచయ టీజర్ తోనే అర్ధమయ్యింది. ఈ సినిమాను మొదట్లో వంద కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని అనుకుంటే ఆ తరువాత అంతకంతకు పెరిగిన మాట నిజమేనని ఆ విజువల్స్ చూస్తుంటేనే అర్ధమవుతోంది.
Recommended Video
నార్త్ లో హై డిమాండ్
దాదాపు 200కోట్ల వరకు ఖర్చు చేయవచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. బన్నీ సినిమాలకు నార్త్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే గతంలో కేవలం యూ ట్యూబ్ వ్యూవ్స్ ద్వారా రికార్డును అందుకున్న బన్నీ ఇప్పుడు డైరెక్ట్ గా నార్త్ థియేటర్స్ లోకి వెళ్లి బాక్సాఫీస్ హిట్టు కొట్టాలని అనుకుంటున్నాడు. సినిమా ఆగస్ట్ 13న భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే.