IPL 2025: ఐపీఎల్‌‌లో సల్మాన్ సికందర్.. రాజమౌళి షూట్ నుంచి నేరుగా ప్రియాంక చోప్రా.. ఇంకా ఎవరెవరంటే?

భారత్ క్రీడా రంగంలో అత్యంత విలాసవంతమైన, ఖరీదైన టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) ప్రారంభ వేడుకకు సర్వం సిద్దమైంది. మార్చి 22వ తేదీన ప్రారంభమయ్యే ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభ వేడుకకు క్రికెటర్లు, సినీ తారలు పోటెత్తనున్నారు. కోల్‌కోత్తాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఈ వేడుక కోసం అంతా ముస్తాబు చేశారు. అయితే ఈ కనివినీ ఎరుగని రీతిలో జరిగే ఈవెంట్‌లో సినీ తారలు ఎవరెవరు పాల్గొంటున్నారంటే?

ఐపీఎల్ 2025 లో భాగంగా KKR Vs RCB జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన ఆరంభ వేడుకలో బాలీవుడ్ తారలు తళుక్కున మెరువనున్నారు. ఈ వేడుకలో స్త్రీ 2 ఫేమ్ బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్, వరుణ్ ధావన్, సింగర్ ఆర్జిత్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. వీరి చేసే స్పెషల్ షో ద్వారా ప్రేక్షకులను ఉత్పాహ పరచనున్నారు. బాలీవుడ్ పాటలను ఆర్జిత్ సింగ్ ఆలపిస్తూ లైవ్ ఈవెంట్‌ను కొనసాగించనున్నారని తెలిసింది.

IPL 2025 opening ceremony

ఇంకా ప్రారంభ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ మూవీని ప్రమోషన్స్ చేయనున్నారు. ఇందుకోసం సల్మాన్ స్వయంగా కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్స్‌కు రానున్నట్టు సమాచారం. ఈ వేదిక ద్వారా ఈద్‌కు రిలీజ్ కానున్న సికందర్ సినిమాను ప్రమోట్ చేయనున్నారు అని ఈవెంట్ నిర్వాహకులు వెల్లడించారు. సల్లూభాయ్‌తోపాటు షారుక్ కూడా భాగం కానున్నారు.

ఇక ఐపీఎల్ 2025 లాంచ్ ఈవెంట్‌లో అమెరికాలో పాపులర్ బ్యాండ్ కూడా భాగం కానున్నారు. ఈ వేడుకలో వన్ రిపబ్లిక్ బ్యాండ్ కార్యక్రమం హైలెట్‌గా నిలిచే అవకాశం ఉంది. వీరి పెర్ఫార్మెన్స్ కోసం క్రికెట్, సినీ సంగీత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వన్ రిపబ్లిక్ ఫెర్ఫార్మెన్స్ ద్వారా కొత్త అనుభూతిని పొందేందుకు అభిమానులు సిద్దమవుతున్నారు.

Take a Poll

ఇదిలా ఉండగా, ఐపీఎల్ ప్రారంభ వేడుకలో బాలీవుడ్ తారలు భారీగా హాజరుకానున్నారు. శ్రేయా ఘోషల్, దిశా పటానీ, కరణ్ ఔజ్లా తదితరులు పెర్ఫార్మ్ చేస్తారు. వన్ రిపబ్లిక్‌తోపాటు దిశా పటానీ, కరణ్ భాగమై.. ఈ వేడుకలో ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఓపెనింగ్ కార్యక్రమంలో బాలీవుడ్‌కు చెందిన అగ్ర నటీనటులు ప్రియాంక చోప్రా, సంజయ్ దత్, వికీ కౌశల్, సల్మాన్ ఖాన్, ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ తదితరులు హాజరుకానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X