తల్లిని చివరిచూపు చూసుకోని ఇర్ఫాన్ ఖాన్.. పుట్టెడు దు:ఖంలో అలా అంత్యక్రియలు పూర్తి
కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది తమ తల్లిదండ్రులను చివరిచూపుగా చూసుకోలేని సంఘటనలు అందర్నీ కలిచివేస్తున్నాయి. ప్రయాణాలకు వీలు లేకపోవడంతో తమ తల్లిదండ్రులకు, ఆప్తులకు, సన్నిహితుల అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయిదా శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సయిదా అంత్యక్రియల వివరాలు..

విషాదంలో ఇర్ఫాన్ ఖాన్
రాజస్థాన్‌కు చెందిన టోంక్ నవాబ్ వంశానికి చెందిన ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయిదా ఖాన్ జైపూర్‌లోని బెనీవాల్ కంటా కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్నారు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ శనివారం మరణించారు. దీంతో ఇన్ఫాన్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

తల్లిని చివరిచూపు చూసుకోకుండానే
ఇర్ఫాన్ ఖాన్ తన తల్లి మరణవార్త తెలిసిన సమయంలో విదేశాల్లో ఉండటం, కరోనా కారణంగా అక్కడే చిక్కుపోవడం జరిగింది. దాంతో తన తల్లిని చివరిచూపుకు చూసుకోలేని పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్ కారణంగా తన తల్లి అంత్యక్రియలకు దూరంగా ఉన్నారు. మాతృవియోగంతో బాధపడుతున్న ఇర్ఫాన్‌కు పికూ డైరెక్టర్ షూజిత్ సర్కార్, నిర్మాత కోమల్ నహతా తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంత్యక్రియలు
ఇర్ఫాన్ ఖాన్ తల్లి అంత్యక్రియలను కుటుంబ సభ్యులు జైపూర్‌లోని చుంగీ నాకా శ్మశాన వాటికలో నిర్వహించారు. ఆమె అంత్యక్రియలకు అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారని డీఎన్‌ఏ తన కథనంలో వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇర్ఫాన్ ఖాన్ తన తల్లి అంత్యక్రియలను పూర్తి చేశారు.
Recommended Video

సల్మాన్, మిథున్, తదితరులు కూడా
ఇటీవల కాలంలో తమ తల్లిదండ్రులు, సన్నిహితుల అంత్యక్రియలకు మిథున్ చక్రవర్తి, సల్మాన్ ఖాన్ తదితర సినీ ప్రముఖులు దూరంగా ఉన్నారు. మిథున్ తండ్రి ముంబైలో మరణించగా ఆయన బెంగళూరులో ఉన్నారు. ఇక సల్మాన్ ఖాన్ తన మేనల్లుడు మరణించిన సమయంలో ముంబై పరిసర ప్రాంతంలోని పన్వేల్ ఫాంహౌస్‌లో ఉన్నారు. లాక్‌డౌన్ కారణంగా లక్నోలో జరిగిన తన మేనల్లుడి అంత్యక్రియలకు హాజరకాకపోవడం సల్మాన్‌ను మరింత విషాదంలోకి నెట్టింది. తాజాగా ఇర్ఫాన్ ఖాన్‌కు ఇదే పరిస్థితి ఎదురుకావడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











