Devara: దేవరలో ఆ 40 నిమిషాలు ఏం చేశారు?

తెలుగు సినిమా దగ్గర చాలా శుక్రవారాలు తర్వాత మళ్ళీ ఓ ఫ్రైడే థియేటర్లు కళకళలాడింది ఎప్పుడంటే ఈ సెప్టెంబర్ 27 శుక్రవారమే అని చెప్పొచ్చు. నిజానికి ఇదే సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ చిత్రం "ఓజి" విడుదల కావాల్సి ఉంది కానీ ఈ సినిమా వాయిదాలో ఇదే డేట్ కి మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి వచ్చాడు.

ఆర్ ఆర్ ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలో రిలీజ్ గా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో "దేవర" అనే చిత్రం వచ్చింది. మరి అవ్వడానికి లేట్ గానే స్టార్ట్ అయ్యినప్పటికీ వేగంగానే పూర్తయ్యింది.

Is 40 minutes episode removed from Devara netizens asks

అయితే ఈ చిత్రం నిజానికి ఇదే ఏడాదిలో ఉగాది కానుకగా రిలీజ్ కి షెడ్యూల్ చేశారు. కానీ అది కాస్తా మళ్ళీ దసరా బరిలోకి మారిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఎప్పుడైతే సెప్టెంబర్ 27న ఓజి సినిమా లేదని కన్ఫర్మ్ అయ్యిందో అప్పుడు ఇదే డేట్ లోకి మారి ఎట్టకేలకు బిగ్ స్క్రీన్స్ లోకి అదే డేట్ లో మిస్సవ్వకుండా వచ్చేసింది.

మరి ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ భారీ ఎత్తున ప్రమోట్ చేసాడు. కానీ సీన్ కట్ చేస్తే ఆ ప్రమోషన్స్ చేసిన రేంజ్ ని ఇది మ్యాచ్ చెయ్యలేకపోయింది అని టాక్ వచ్చింది. ఇంకా చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో డిజప్పాయింట్ అయ్యామని కూడా చెబుతున్నారు.

కాగా ఈ చిత్రం చూసాక మాత్రం చాలా మంది ఓ 40 నిమిషాల ఎపిసోడ్ కోసం మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో మాట్లాడుతూ సినిమాలో క్లైమాక్స్ పోర్షన్ మొత్తం 40 నిమిషాలు ఊహించని రేంజ్ లో ఉంటుంది అని ఆడియెన్స్ అంతా బాగా థ్రిల్ అయిపోతారు అన్నట్టుగా ఎక్కువ ఆ 40 నిమిషాల ఎపిసోడ్ కోసం ఎక్కువ హైప్ ఇస్తూ చెప్పాడు.

Is 40 minutes episode removed from Devara netizens asks

కానీ సీన్ కట్ చేస్తే సినిమాలో సెకండాఫ్ అలాగే ఆ క్లైమాక్స్ ఎపిసోడ్సే చాలా వీక్ గా ఉన్నాయని కంప్లైంట్స్ వస్తున్నాయి. అంతే కాకుండా ఇంతకీ ఆ 40 నిమిషాలు కూడా ఎక్కడో చెప్తే బాగుండేది అని అంతలా ఎగ్జైట్ చేసే 40 నిమిషాల ఎపిసోడ్ కనిపించకుండానే సినిమా పూర్తయ్యిపోయింది అంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

అంటే సినిమాలో అంతగా లేపిన ఆ సీన్ లో ఏమీ లేదని అనేస్తున్నారు. సో ఇలా కొరటాల ఎన్టీఆర్ లు ప్రమోషన్స్ లో మాత్రం ఆడియెన్స్ ని ఫూల్స్ చేసారని కొందరు అంటున్నారు. మరి ఇలా ఒక రకమైన మిక్స్డ్ టాక్ తోనే దేవర వరల్డ్ వైడ్ రెస్పాన్స్ ని అందుకున్నాడు. మరి అంతిమంగా దేవర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అనేది కూడ యిపుడు మరింత రసవత్తర అంశంగా మారింది.

More from Filmibeat

Read more about: jr ntr devara koratala siva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X