twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Brahmaji: 'అంకుల్ ఏంట్రా.. అంకుల్.. కేసు వేస్తా ' అని బ్రహ్మాజీ పోస్ట్​.. అనసూయకు సెటైర్​?

    |

    ఇక ఇప్పుడు ఆంటీ, అంకుల్​ అని పిలవడం నేరంగా పరిగణించవచ్చేమో అని అనిపిస్తుంది ప్రస్తుతం టాలీవుడ్​లో నెలకొన్న పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే, రీసెంట్​గా యాంకర్​, నటి అనసూయను ట్విటర్​లో ఆంటీ అని పిలవడం, దానిపై కేసు వేస్తానని చెప్పడంతో పాటు పోలీసులను ఆశ్రయించడం హాట్​ టాపిక్​ అయింది. ఇక దీనిపై మాములుగా ట్రోల్స్​, మీమ్స్​ రాలేదు. అంతేకాకుండా ఒక రోజు ఆంటీ అని హ్యాష్​ట్యాగ్​ కూడా ట్రెండ్​ అయింది. అయితే తాజాగా ఈ విషయంపై నటుడు బ్రహ్మాజీ పరోక్షంగా సెటైర్​ వేసినట్లు తెలుస్తోంది.

    సక్సెస్​ఫుల్​గా..

    సక్సెస్​ఫుల్​గా..

    సీనియర్​ నటుడు బ్రహ్మాజీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్​గా, నటుడిగా ఎన్నో పాత్రల్లో అలరిస్తూ వస్తున్నాడు. చిన్నా, పెద్ద అనే ఏ తేడా లేకుండా సుమారు అందరూ అగ్ర హీరోలతోపాటు యువ కథానాయకులతో కలిసి నటించాడు. అప్పుడప్పుడు టీవీ షోలలో, పలు కార్యక్రమాలలో తనదైన కామెడీ పంచులతో ఆడియెన్స్​ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సినిమాల్లో సహాయ నటుడు, నెగెటివ్​ రోల్స్​ వంటి విభిన్నమైన పాత్రలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో సక్సెస్​ఫుల్​ నటుడిగా రాణిస్తూ ముందుకు సాగుతున్నాడు.

    అది బాడీ షేమింగ్​..

    అది బాడీ షేమింగ్​..

    ఇక ఇటీవల ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్​ ట్రెండ్​ అవడం, ఆంటీ అని పిలిస్తే వేధించినట్లే అని యాంకర్​ అనసూయ చెప్పడం పెద్ద రచ్చ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అది బాడీ షేమింగ్​ మీదకు వస్తుందని, కేసు వేస్తానని కూడా హెచ్చరించింది. అయితే తాజాగా నటుడు బ్రహ్మాజీ పెట్టిన పోస్ట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది. కాసేపటి క్రితం ట్విటర్​లో బ్రహ్మాజీ ఒక ఫొటోను షేర్​ చేస్తూ ''ఏం జరుగుతోంది?'' అని ట్వీట్​ చేశాడు.

    అంకుల్​ ఏంట్రా?

    అంకుల్​ ఏంట్రా?

    దానకి ఓ నెటిజన్​.. 'ఏం లేదు అంకుల్'​ అని సమాధానమిచ్చాడు. అది చూసిన బ్రహ్మాజీ 'అంకుల్​ ఏంట్రా అంకుల్​.. కేసు వేస్తా.. ఏజ్​.. బాడీ షేమింగా?' అంటూ ఫన్నీ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. ఇక వైరల్​ అయిన ఈ ట్వీట్​ను చూసిన నెటిజన్లు మరింత ఫన్నీగా స్పందిస్తున్నారు. 'మీరు ఎన్ని కేసులు వేస్తానని చెప్పినా, ఆ ఆంటీ గారికి వచ్చినంత అటెన్షన్​ మాత్రం మీకు రాదు బ్రహ్మాజీ గారు' అంటూ ఒకరు కామెంట్​ చేశారు.

    సెటైర్​ వేశాడా?

    సెటైర్​ వేశాడా?

    మరొకరు 'ఇప్పుడు మీరు కూడా స్టార్ట్​ చేశారా? అయితే ఎన్ని కేసులు పెడతారు సార్​?' అని కామెంట్​ చేశారు. ఇలా వివిధ రకాలుగా సోషల్​ మీడియాలో ఫన్నీగా కామెంట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ ఆంటీ అనే హ్యాష్​ట్యాగ్​ ట్రెండింగ్​ అంతా విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్​ మూవీపై పరోక్షంగా అనసూయ కామెంట్స్ చేస్తూ పోస్ట్​ చేయడంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రహ్మాజీ పెట్టిన పోస్ట్​ అనసూయకు సెటైర్​ వేశాడా? లేదా ప్రస్తుత పరిస్థితిపై తన సెన్స్ ఆఫ్​ హ్యూమర్​​ను చూపించాడా? అనేది తెలియదు.

    English summary
    Tollywood Senior Actor Brahmaji Funny Tweet About Calling Him As Uncle. And It Looks Like It Is A Counter To Anchor Anasuya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X