రేవ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నటి హేమ.. డ్రగ్ పార్టీలో వైసీపీ ఎమ్మెల్యే బెంజ్ కారు సీజ్?

బెంగళూరులో నిర్వహించిన డ్రగ్స్ అండ్ రేవ్ పార్టీ సంచలనం రేపుతున్నది. అయితే ఈ రేవ్ పార్టీలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అలాగే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారనే విషయం మరింత సంచలనం రేపింది. అయితే రేవ్ పార్టీకి నేను హాజరు కాలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ శ్రీకాంత్, నటి హేమ వీడియో బైట్స్ ఇచ్చి క్లారిటీ ఇచ్చారు. అయితే నటి హేమ ఇచ్చిన వీడియో బైట్‌లో పార్టీ జరిగిన ప్రదేశాన్ని నెటిజన్లు గుర్తించి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫోటోలు షేర్ చేసిన వివరాల్లోకి వెళితే..

బెంగళూరులోని ఓ కంపెనీ అధినేతకు సంబంధించిన ఫార్మ్ హౌస్‌లో భారీగా రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీని నిర్వహించిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన వాసు అని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ టీమ్ వెల్లడించింది. అయితే ఈ పార్టీలో 100 మంది ఉన్నారు. సుమారుగా 25 మంది మహిళలు కూడా ఉన్నారు అని వెల్లడైంది.

Is Actor Hema participated in Bangalore Rave Party YSRCP MLA Car found Here is complete Details

అయితే రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ ఉందంటూ వార్తలు రాగానే.. ఆమె వెంటనే స్పందించింది. అయితే తాను రేవ్ పార్టీలో లేను. బెంగళూరులో లేను. హైదరాబాద్‌లోని ఫామ్ హౌజ్‌లో చిల్ అవుతున్నాను అంటూ లైవ్ వీడియోను రిలీజ్ చేసింది. అయితే ఆమెను నెటిజన్లు అక్కడే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. ఆమె ఉన్నది రేవ్ పార్టీ జరిగిన ప్రాంతంలోనే అంటూ సర్కిల్ గీసి ఫోటోలను షేర్ చేస్తున్నారు.

అయితే హేమ లైవ్ వీడియోను రిలీజ్ చేసిన దానిలో బ్యాక్ గ్రౌండ్.. పార్టీ జరిగిన ప్రదేశానికి సంబంధించిన ఫోటో బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉండటంతో ఆమె నిజంగానే పార్టీకి హాజరైందనే ఆరోపణలను నెటిజన్లు చేస్తున్నారు. అయితే వీడియో, ఫోటోలో కనిపించే చెట్లు, లాన్ అంతా ఒకేలా ఉండటంతో ఆమె అక్కడే ఉందనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత, ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రికి చెందిన స్టిక్కర్‌తో ఉన్న బెంజ్ కారు‌ను పోలీసులు సీజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రముఖులకు చెందిన మెర్సిడెజ్ బెంజ్, జాగ్వార్, ఆడీ లాంటి విలాసవంతమైన కార్లు కూడా సీజ్ చేసినట్టు సమాచారం.

రేవ్ పార్టీ జరిగిన భావిస్తున్న ప్రాంతంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నారు. సుమారుగా 50 లక్షల రూపాయలతో పార్టీ నిర్వహించారు. 18వ తేదీ రాత్రి నుంచి 19వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు పార్టీ జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X