పూజారులతో అదితిరావు, సిద్దార్థ్ చీటింగ్.. పెళ్లి విషయంలో ఘోరమైన అబద్దం చెప్పి!

దక్షిణాది సినీ హీరో సిద్దార్థ్, బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరీ గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత కొద్దికాలంగా వారిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చినప్పటికీ.. అందరూ వాటిని కొట్టిపడేశారు. అయితే అదితి రావు వారసత్వంగా ఉన్న ఆలయంలో మ్యారేజ్ చేసుకొని షాకిచ్చారు. అయితే వారు తమ వివాహం గురించి ఎవరికి తెలియకుండా చీట్ చేశారనే విషయం మరింత ఆసక్తిని రేపింది. ఆ వివరాల్లోకి వెళితే..

గతంలో తమ జీవిత భాగస్వాములతో విడాకులు తీసుకొన్న అదితిరావు హైదరీ, సిద్దార్థ్ మహా సముద్రం సినిమా షూటింగులో ఒకరికొకరు పరిచయం అయ్యారు. వారి పరిచయం ప్రేమగా మారి కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్నారు. అయితే మార్చి 27వ తేదీన వారిద్దరూ వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలోని శ్రీ రంగాపురంలోని శ్రీ రంగనాయక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు.

Is Aditi Rao Hydari and Siddarth Cheated Priests about their marriage

అయితే తమ పెళ్లి గురించి వార్తలు బయటకు పొక్కకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. శ్రీరంగనాయక ఆలయంలోని పూజారులకు సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమా కోసం పెళ్లి సెట్ వేసి వివాహ సన్నివేశాలను చిత్రీకరిస్తాం. మీరు ఈ షూట్‌కు దూరంగా ఉండాలని పూజారులకు సూచించారు అని తెలిసింది.

ఇక షూటింగ్ అని చెప్పడంతో ఆలయ పరిసరాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో తమిళనాడుకు చెందిన బ్రహ్మణులు ఆలయంలోకి ప్రవేశించారు. పెళ్లి మండపాన్ని అందంగా ముస్తాబు చేశారు. అనంతరం వారి సమక్షంలో నిజమైన పెళ్లి చేసుకొన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత స్థానిక పూజారులు నివ్వెరపోవడం వారి వంతు అయింది.

Is Aditi Rao Hydari and Siddarth Cheated Priests about their marriage

అదితిరావు విషయానికి వస్తే.. ఆమె తల్లి విద్యారావు వనపర్తి సంస్థానానికి చివరి రాజు రామేశ్వరరావు కూతురు. ఈ వివాహానికి రామేశ్వరరావు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక అదితి, సిద్దార్థ్‌కు చెందిన అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X