OG మూవీలో అకీరా నందన్.. పవన్ కల్యాణ్ కుమారుడి టాలీవుడ్ ఎంట్రీ వార్త కరెక్టేనా?
ఓజాస్ గంభీరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న చిత్రం OG (They Call Him OG). పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెంచుకొన్నారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సాహో ఫేమ్ సుజిత్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో మలయాళ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, మలయాళ నటుడు అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, తమిళ నటి శ్రీయాెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాకుడిగా రవి కె చంద్రన్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాగ్ ఫైర్ స్టార్మ్ (Fire Storm) విడుదలై సంగీత ప్రపంచంలో సునామీని సృష్టిస్తున్నది. ఈ పాటలో యానిమేటెడ్ పార్ట్‌లో కనిపించిన ఓ యువకుడి చిత్రం చూసి పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ అంటూ సోషల్ మీడియాలో ఊహగానాలు మొదలయ్యాయి. అయితే నిజంగా ఈ సినిమాలో అకీరా నటిస్తున్నాడా? ఆ పాత్రలో నటించేంది ఎవరు? అనే విషయంలోకి వెళితే..
పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎస్ స్వర పరిచిన ఫైర్ స్టార్మ్ పాట మ్యూజిక్ చార్ట్ బస్టర్స్‌లో రెండో స్థానంలో సాగుతున్నది. హాలీవుడ్, ఇతర ఇంటర్నేషనల్ సాంగ్స్‌ను వెనక్కి నెట్టి ట్రెండింగ్‌లో కొనసాగుతున్నది. అయితే లిరికల్ వీడియోలో ఓ యువకుడు కనిపించడంతో అకీరా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఓజీ (OG) చిత్రంలో అకీరా నందన్ నటించారని భావిస్తున్న పాత్రలో జపాన్ నటుడి యాక్టింగ్ చేస్తున్నారు. అతడి పేరు కజుకి కిటమురా. గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఈ కీలక పాత్ర పోషిస్తున్నారు. యానిమేటెడ్ లిరికల్ వీడియోలో ముఖం సరిగా కనిపించకపోవడంతో అకీరా అని అందరూ భావించారు. ఈ సినిమాలో కజుకి పవర్‌ఫుల్ పాత్రలో మార్షల్ ఆర్ట్స్ ఆధారంగా సాగే యాక్షన్ పార్ట్ రోల్ పోషిస్తున్నారు.

కజుకి కిటమురా కెరీర్ విషయానికి వస్తే. కిల్ బిల్, గాడ్జిల్లా, ఫైనల్ వార్, సైలెంట్ పెరేడ్, ఫోక్‌లూర్ లాంటి సినిమాల్లో నటించారు. ఇంకా పలు జపనీస్ టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. ఇంకా పలు సినిమాల్లో నటించి పలు అవార్డులు, రివార్డులు అందుకొన్నారు


Click it and Unblock the Notifications











