RRR రాజమౌళికి షాకిచ్చిన స్టార్ హీరోయిన్.. ప్రమోషన్స్‌కు దూరంగా.. కారణం ఏమిటంటే?
వరుస అవకాశాలు అందుకుంటూ బాలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది ఆలియా భట్. ఆర్ఆర్ఆర్తో ఆమె దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా సీత పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ భారీ పిరియాడికల్ యాక్షన్ డ్రామా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించబోతోంది.

ప్రమోషన్ ఖర్చులు వృథా అయ్యాయా?
ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదాలు పడిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 7న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. భారీ స్థాయిలో ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమోషన్ కార్యక్రమాల కోసమే దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్.. ఇలా అన్ని ప్రముఖ నగరాల్లోనూ చిత్ర యూనిట్ ప్రమోషన్ నిర్వహించింది. పలు చోట్ల భారీ ఫంక్షన్లు చేశారు. పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కట్ చేస్తే.. కరోనా థర్డ్ వేవ్ కారణంగా విడుదల మరోసారి వాయిదా పడింది.

ప్రమోషన్స్ షురూ
విడుదల మరో 15 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో సినిమా యూనిట్ మరోసారి ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించబోతోందట. పలు మెట్రో నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్‌ను భారీగా నిర్వహించబోతోందట. రాజమౌళి, ఎన్టీయార్, చరణ్ మళ్లీ ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, త్రివేండ్రం మొదలైన నగరాల్లో సందడి చేయనున్నారట. ముంబైలో భారీ ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నారట.

ఆలియా దూరం
ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు ఆలియా దూరంగా ఉండనుందని తెలుస్తోంది. ఆలియా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ హాలీవుడ్ మూవీకి కూడా సైన్ చేసింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ కోసం గత డిసెంబర్‌లో ఆలియా అన్ని నగరాలూ తిరిగింది. ఆ కారణంగానే మరోసారి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో ఆలియా పాల్గొనలేకపోతోందని చెబుతున్నారు. గతంలో ఆలియా ప్రమోషన్ కార్యక్రమాల కోసం 15 రోజులు కేటాయించిందట. ఈసారి మాత్రం అన్ని రోజులు ఆలియా అందుబాటులో ఉండదట. ముంబైలో జరిగే కార్యక్రమాలకు మాత్రం ఆలియా హాజరయ్యే అవకాశాలున్నాయట.

హైదరాబాద్‌లో ఫంక్షన్ ఉంటుందా?
హైదరాబాద్‌లో ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వాహించాలా? వద్దా అనే సందిగ్ధంలో చిత్ర యూనిట్ ఉందట. ఇద్దరు అగ్ర కథానాయుకులు ఉన్నారు కాబట్టి.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే అభిమానులు భారీగా తరలివస్తారు. అంతమంది పట్టే స్థలం కోసం అన్వేషించడం, పాస్‌లు ఇవ్వడం, పోలీస్ పర్మిషన్ దొరకడం కష్టమవుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే హైదరాబాద్‌లో ఫంక్షన్ లేకుండా మీడియా మీట్‌తో సరిపెట్టాలని భావిస్తున్నారట.

విడుదలకు ముందే రూ.225 కోట్లు?
దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా విడుదలకు ముందే భారీగా ఆదాయం సంపాదించినట్టు సమాచారం. సినిమాకు నాన్ థియేట్రికల్ రూపంలో 225 కోట్లు ఆదాయం వచ్చిందట. పలుసార్లు విడుదలలు వాయిదా పడడం, ఖర్చులు, వడ్డీలు అన్నీ కలిపి సినిమా బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు అని సమాచారం. ఈ సినిమాను నిర్మాత హిందీలో స్వయంగా విడుదల చేసుకుంటున్నారు. ఓవర్ సీస్, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక హక్కులను ఇతరులకు అమ్మేశారు.


Click it and Unblock the Notifications











