అల్లు అర్జున్ - అట్లీ చిత్రం ఆగిపోయింది? అసలు చిక్కు ఇక్కడే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపుదిద్దుకోనున్న చిత్రంపై ఇప్పటికే మార్కెట్లో తారా స్థాయి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా అప్డైట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఓవైపు మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో నటించాల్సిన ప్రాజెక్ట్ ను పక్కనబెట్టి మరీ అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫుల్ హైప్ పెరిగింది. ఇక సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్లబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అట్లీ కూడా ఇంట్రెస్టింగ్ కాస్ట్ ను సెట్ చేశారనే వార్తలు వచ్చాయి.

కాగా అప్పటికే అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప2'తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1,870 కోట్ల పైగా గ్రాస్ వసూల్ చేసి సంచలనంగా మారాడు అల్లు అర్జున్. ఏకంగా రూ.1810 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన బాహుబలి2 రికార్డును దాటేసి ఇండియాలోనే హ్యయేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన రెండో చిత్రంగా రికార్డు నమోదు చేసింది. దీంతో అల్లు అర్జున్ నుంచి రాబోయే తదుపరి చిత్రంపై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఈలోగా వెంటనే షూట్ మోడ్ లోకి వచ్చిన అల్లు అర్జున్ అట్లీతో ప్రాజెక్ట్ ను ఓకే చేశారు.

Is Allu Arjun-Atlee movie stopped Here s the actual reason for this rumours on crazy combination

'జవాన్' చిత్రంతో అప్పటికే రూ.1100 కోట్ల సినిమాను ఇచ్చిన తమిళ దర్శకుడు అట్లీ, పుష్ప2తో రెండో అత్యధిక గ్రాస్ వసూల్ చేసిన చిత్రాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కాంబోలో రాబోయే చిత్రంపై మార్కెట్ లోనూ డిమాండ్ పెరిగింది. అందుకు తగినట్టుగానే అట్లీ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఎప్పుడూ సెట్స్ మీదకు తీసుకెళ్తారోనని అభిమానులంతా ఎదురుచూస్తున్న తరుణంలో ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అట్లీ - అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ... అందుకు ప్రధానంగా నాలుగు కారణాలున్నాయిని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

అట్లీ - అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ను తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను రూపొందించలేమంటూ చేతులెత్తిసినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు కారణంగా అంచనాకు మించిన బడ్జెట్ అంటున్నారు. రూ.600 కోట్ల వరకు బడ్జెట్ అవుతుండటంతో పక్కకు తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడా సంస్థ స్థానంలోకి టాలీవుడ్ లో భారీ చిత్రాలను నిర్మిస్తున్న ఓ సంస్థ వచ్చినట్టు కూడా ప్రచారం. అయితే ఆ ఛాన్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ దక్కించుకున్నారని అంటున్నారు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు... అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కు దర్శకుడు అట్లీ తీసుకోబోతున్న రెమ్యునరేషన్ కూడా ఓ కారణమని తెలుస్తోంది. ఏకంగా రూ.100 కోట్లు డిమాండ్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వాస్తవం ఎంతనేది చూడాలి. బాలీవుడ్ లో దుమ్ములేపిన అట్లీ, నెక్ట్స్ సల్మాన్ ఖాన్ తోనూ ఓచిత్రం చేయాల్సి ఉంది.. పైగా అట్లీ చిత్రాలకు కూడా అటు మార్కెట్ లో, ఇటు ఆడియెన్స్ లో మండి డిమాండ్ ఉండటం కారణంగా ఇంత రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

Is Allu Arjun-Atlee movie stopped Here s the actual reason for this rumours on crazy combination

అలాగే.. పుష్ప2తో అల్లు అర్జున్ రూ.1870కోట్ల గ్రాస్ వసూల్ చేసినప్పటికీ.. నెక్ట్స్ వచ్చే ఈ ప్రాజెక్ట్ కు అంత వసూళ్లు వచ్చే ఛాన్స్ లేదని నిర్మాతలు భావిస్తున్నారంట. పుష్ప మొదటి భాగం హిట్ కావడంతో.. ఆ క్రేజ్ తోనే పుష్ఫ2 కూడా హిట్ అయ్యిందని, ఆ స్థాయి కలెక్షన్లు వచ్చాయని చర్చించుకుంటున్నారంట. దీంతో అల్లు అర్జున్ కు రాబోయే చిత్రానికి ఆ స్థాయిని మించి కలెక్షన్లు వస్తాయనడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారంట. మరోవైపు అట్లీ తీయబోయే చిత్రానికి కూడా బడ్జెట్ ఓ రేంజ్ లో ఉండటం, మార్కెట్ దృష్ట్యా భారీ తేడాలు కనిపిస్తుండటమూ ఓ కారణమని అంటున్నారు.

ఇక రీసెంట్ గాసిప్స్ ప్రకారం... శివకార్తీకేయన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారని తెలుస్తోంది. దాంతో మల్టీస్టారర్ చిత్రాలకు ఇప్పటి వరకు ఓకే చెప్పని అల్లు అర్జున్.. శివకార్తీకేయన్ తో కలిసి నటించేందుకు అంగీకరిస్తారా? అనేది సందేహంగా మారింది. ఇన్ని కారణాల మధ్య ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్స్ మీదకు వెళ్లబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లను కూడా ఎంపిక చేశారని, కేవలం 8 నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారని కూడా టాక్ వినిపించింది. ఇక ఏం జరుగుతుందో చూడాలి.

Take a Poll

More from Filmibeat

Read more about: allu arjun atlee allu arjun atlee
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X