Allu Arjun Vs Pawan: నాకు ఇష్టమైతే.. నా మనసుకు నచ్చితే వస్తా.. పవన్, నాగబాబుకు అల్లు అర్జున్ కౌంటర్

విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా రూపొందిన సినిమా మారుతి నగర్ సుబ్రమణ్యం. యువ దర్శకుడు లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ పతాకాలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత సమర్పణలో ఆగస్టు 23న థియేటర్లలో విడుదల కానున్నది.

శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా బుధవారం (ఆగస్టు 21న) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు దుమారం రూపుతూ చర్చనీయాంశమయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

Allu Arjun counter to Pawan Kalyan

మై డియర్ ఫ్యాన్స్. నా ఫ్యాన్స్. ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ నాకు పిచ్చి. ఎవరైనా ఏదైనా హీరో చూసి ఫ్యాన్స్ అవుతారు. కానీ నా ఫ్యాన్స్ చూసి నేను హీరో అయ్యాను. నా ఫ్యాన్స్. నా ఆర్మీ కి లవ్ యూ లవ్ యూ అంటూ ఊగిపోయాడు అల్లు అర్జున్. నా సినిమా వచ్చి మూడు సంవత్సరాలు అయింది. కానీ నాపై మీ ప్రేమ తగ్గలేదు అంటూ కామెంట్ చేశాడు.

ఇక ముందు నా సినిమాల విషయంలో ఆలస్యం జరగదు. ఇంకోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తా. ఎక్కువ సార్లు కనిపిస్తా. కానీ నాపై మీ ప్రేమ తరగలేదు. ఈ ఫంక్షన్‌కు వచ్చి పెద్ద హిట్ చేసిన అభిమానులు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.

మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాను సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పిస్తున్నారు. ఆమె ఒక రోజు వచ్చి ఆ విషయం చెప్పారు. ఎలాగు సుకుమార్ గారు వస్తారు. నేను సుకుమార్‌ను తప్పిస్తే.. ఇంకా మిమ్మల్ని కాకుండా ఎవరిని అడగ గలను చెప్పండి అన్నారు. దాంతో నేను వస్తానని మాట ఇచ్చాను అని అల్లు అర్జున్ అన్నారు.

పుష్ప క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. అంతటి సిచ్యుయేషన్‌లో కూడా రావాలని అనుకొన్నాను. మనకు ఇష్టమైన వారికి మన సపోర్ట్‌ను చూపించాలి. నాకు ఇష్టమైతే నేను వస్తా. నా మనసుకు నచ్చితే వస్తా. అదీ మీ అందరికి తెలిసిందే అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం మెగా క్యాంప్‌ను ఉద్దేశించి చేసినవే అనే అభిప్రాయం మీడియా వర్గాల్లోను, నెటిజన్లలోను వ్యక్తమవుతున్నది.

అయితే గతంలో నేను హీరో అయ్యానంటే కారణం మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్పూర్తితోనే నేను హీరోను అయ్యానని చెప్పిన అల్లు అర్జున్.. ఇప్పుడు ఫ్యాన్స్ వల్లే హీరోను అయ్యానని చెప్పడం చర్చనీయాంశమైంది. మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్, నాగబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసి అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

More from Filmibeat

Read more about: allu arjun pawan kalyan nagababu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X