సీఎం రేవంత్ దెబ్బ అల్లు అర్జున్ కి గట్టిగానే తగిలిందా?
ఇటీవల కొన్ని నెలల కాలంలోనే మన తెలుగు సినిమాకి సంబంధించి పలు కాంట్రవర్సీలు చాలానే ఉన్నాయి అని తెలిసిందే. కాగా వీటిలో టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో జరిగిన హంగామా కూడా అంతా ఇంత కాదు కాగా అల్లు అర్జున్ నటించిన అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం పుష్ప 2 ది రూల్ పాన్ ఇండియా లెవెల్లో ఎన్నో రికార్డులు సెట్ చేసినప్పటికీ ఈ సినిమా రిలీజ్ కి ముందు జరిగిన పలు షాకింగ్ ఘటనలు మాత్రం అల్లు అర్జున్ కి బాగా ఎఫెక్ట్ తెచ్చి పెట్టాయి.
అప్పటికే ఏపీ రాజకీయాలకి సంబంధించిన పలు కాంట్రావర్సిలు ఎదుర్కొంటున్న అల్లు అర్జున్ దాని నుంచే తేరుకునే లోపే తెలంగాణ రాజకీయాలకి సంబంధించి కూడా ఊహించని ఇష్యూలో బన్నీ ఇరుక్కున్నాడు. మరి సంధ్య థియేటర్ ఉదంతం దానికి తోడు తన స్పీచ్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా మర్చిపోవడంతో ఐకాన్ స్టార్ కి చాలా ఎఫెక్ట్ అయ్యింది.

కాగా ఇది మాత్రమే కాకుండా గతంలో కూడా అల్లు అర్జున్ స్పీచ్ లకి సంబంధించి పలు ట్రోల్స్ లేకపోలేవు. వీటితో అల్లు అర్జున్ ఏం మాట్లాడినా కూడా తన స్పీచ్ లో ఒకింత సహజత్వం లోపిస్తుంది అని ఎన్నో నెగిటివ్ కామెంట్స్ చాలా సార్లు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఈ ఎఫెక్ట్ అంతా వేరేలా మారేసరికి అల్లు అర్జున్ ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా అల్లు కాంపౌండ్ చెబుతుంది.
కాగా అల్లు అర్జున్ తన మాటల మూలాన ఎలాంటి ఎఫెక్ట్ అందరికీ ఉండకూడదు అనే కారణంతో ఒక స్పోక్స్ పర్సన్ ని తన కోసం తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అంటే అల్లు అర్జున్ ఏదైనా ఈవెంట్ కి హాజరు కావాల్సి ఉంటే అతడు అల్లు అర్జున్ ఏం మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అనే అంశాలు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోనున్నాడని తెలుస్తుంది.

మరి ఎన్నడూ లేనిది అల్లు అర్జున్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం మాత్రం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విషయంలో జరిగిన ఘటనేనా అని డౌట్ రావచ్చు. పుష్ప 2 ఈవెంట్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం అల్లు అర్జున్ కి చాలా ఎఫెక్ట్ అయ్యింది. దీనితో ఇలాంటివి మళ్ళీ ఫేస్ చెయ్యకుండా ఉండాలనే ఐకాన్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం దీనిపై కూడా సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. మరి ఇదంతా ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 లో తన సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న అలాగే శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తే దేవిశ్రీ ప్రసాద్, సామ్ సి ఎస్ లు సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











