అల్లు అర్జున్ .. నేను నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా!.. సైలెంట్‌గా కెలికేసిన బన్నీ

మెగా ఫ్యామిలీలో మునుపటి మాదిరిగా పరిస్ధితులు లేవని ఫిలింనగర్ టాక్. ముఖ్యంగా అల్లు అర్జున్ వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశమైంది. తనకు మెగా ట్యాగ్ లైన్ వద్దు అన్నట్లుగా కొద్దినెలలుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఇది మెగా కుటుంబంలోని హీరోలు, వారి అభిమానుల మధ్య గొడవకు దారి తీసింది. అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ నాటి గొడవలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడంతో ఇవి కాస్తా ముదిరి పాకాన పడ్డాయి. ఇప్పుడిప్పుడే పరిస్ధితులు సద్దుకుంటున్నాయి అనుకుంటున్న దశలో అల్లు అర్జున్ చేసిన పని మరోసారి వివాదాస్పదమైంది.

is allu arjun indirect satires on mega fans with nellore pedda reddy taluka t shirt

మెగా ఫ్యామిలీకి దూరంగా అల్లు అర్జున్

అల్లు అర్జున్ తీరుతో మెగా ఫ్యామిలీ ఆయనను దూరం పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఎన్నికల సమయంలో నాగబాబు ట్వీట్ దీనిని మరింత పెంచింది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతుల సోషల్ మీడియా ఖాతాలను హీరో సాయి దుర్గా తేజ్ అన్ ఫాలో చేయడం కలకలం రేపింది. పదేళ్ల పోరాటం తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మెగా ఇంట్లో జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అల్లు ఫ్యామిలీ లేదు. తర్వాత ప్రమాణ స్వీకారానికి కూడా అల్లు కాంపౌండ్ నుంచి ఎవ్వరూ హాజరుకాలేదు.

నెగిటివ్ ట్రోలింగ్‌కి గేమ్ ఛేంజర్ బలి

అల్లు అర్జున్ - రామ్ చరణ్‌లు బావా బామ్మర్ది అయినప్పటికీ వారు ఫ్రెండ్స్‌లా, సొంత అన్నదమ్ముల్లా మెలిగేవారు. అయితే వీరిద్దరికీ కూడా గ్యాప్ వచ్చినట్లుగా ఫిలింనగర్‌‌లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఒకరి సినిమాలకు మరొకరు అండగా నిలిచేవారు. రామ్ చరణ్ బర్త్ డేకి అల్లు అర్జున్ అర్జున్.. బన్నీ పుట్టినరోజుకు చెర్రీ ఖచ్చితంగా విష్ చేసుకునేవారు, సోషల్ మీడియాలో పోస్టులతో పాటు పార్టీకి సంబంధించిన ఫోటోలు కూడా ఖచ్చితంగా బయటికి వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. మెగా - అల్లు ఫ్యాన్ వార్ మధ్య సినిమాలు బలైపోతున్నాయి. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ వెనుక నెగిటివ్ ప్రచారం సహా , కుట్రలు ఉన్నట్లు అప్పట్లో పలు వార్తలు సైతం వచ్చాయి.

సంథ్య వివాదంలో బన్నీకి మెగా ఫ్యామిలీ బాసట

అయితే సంథ్య థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత అల్లు అర్జున్‌కు మెగా కుటుంబం అండగా నిలిచింవది. బెయిల్‌పై బయటికి వచ్చిన వెంటనే చిరంజీవి, నాగబాబు ఇళ్లకు నేరుగా వెళ్లిన బన్నీ.. వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల పవన్‌తోనూ ఆయన సీక్రెట్‌గా భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ముంబైలో నిన్న జరిగిన ఓ సమ్మిట్‌లోనూ తనకు మావయ్య చిరంజీవి ఇన్స్‌పిరేషన్ అని , ఆయన గ్రేట్ అంటూ ఆకాశానికెత్తేశారు అల్లు అర్జున్. అన్ని గొడవలు సద్దుమణిగి మెగా - అల్లు హీరోలు కలిసిపోతున్న దశలో మరోసారి బన్నీ చేసిన పని చర్చనీయాంశమైంది.

బ్రహ్మానందం టీషర్ట్‌తో అల్లు అర్జున్

ముంబై ఎయిర్‌పోర్టులో అల్లు అర్జున్ వైట్ కలర్ టీషర్ట్‌లో కనిపించారు. దీనిపై దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం చెప్పిన నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే డైలాగ్‌తో పాటు బ్రహ్మీ పాత్ర ఫోటోలు ప్రింట్ అయి ఉన్నాయి. ఈ ఫోటోలు, డైలాగ్‌ని మీమర్స్ ఎక్కువగా వాడతారు . ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అల్లు అర్జున్ కావాలనే కొందరినీ టార్గెట్ చేశారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. పవన్ గెలిచిన తర్వాత ఆయన అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని టీ షర్ట్స్, బైక్స్, కార్లు, ఫ్లెక్సీలు , బ్యానర్లపై రాసుకొచ్చి సందడి చేశారు. ఇప్పుడు బన్నీ కూడా నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అంటూ టీ షర్ట్ మీద రాసుకుని రావడం దుమారం రేపింది. బన్నీ కావాలని ఇలా చేశారా? లేక ఏదో చేయబోతే ఇంకేదో అయ్యిందా అనేది చూడాలి.

More from Filmibeat

Read more about: allu arjun mega fans pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X