twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Allu Arjun పుష్ప తర్వాత ప్యాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్.. రికార్డు రెమ్యునరేషన్‌‌ను ఆఫర్ చేసిన లైకా

    |

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస హిట్లతో దేశవ్యాప్తంగా సెన్సేషనల్ హీరోగా పేరు తెచ్చుకొంటున్నారు. పుష్ప సినిమాతో ఏకంగా ప్యాన్ ఇండియా పాపులారిటీని సంపాదించుకొన్నాడు. ఇక పుష్ప తర్వాత పెరిగిన క్రేజ్, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని క్రేజీ ప్రాజెక్టులు, స్టార్ డైరెక్టర్లు, స్టార్ ప్రొడ్యూసర్స్‌తో సినిమాలు చేసేందుకు సిద్దమవుతున్నాడు. అయితే పుష్ప తర్వాత మరో ప్యాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

    రెండేళ్లలో 200 కోట్ల నుంచి 300 కోట్లు వరకు

    రెండేళ్లలో 200 కోట్ల నుంచి 300 కోట్లు వరకు


    గత రెండేళ్లుగా కరోనావైరస్ సినీ పరిశ్రమను కుంగదీస్తుంటే.. రెండు భారీ, సంచలన విజయాలను అందించిన ఘనత అల్లు అర్జున్‌కే దక్కింది. వరుసగా రెండు సంవత్సరాలు 200 కోట్ల నుంచి 300 కోట్ల వసూళ్లను రాబట్టిన హీరోగా దేశవ్యాప్తంగా అరుదైన ఘనతన సొంతం చేసుకొన్నాడు. ఒక సినిమా నుంచి మరో సినిమాకు తన రేంజ్‌ను పెంచుకొంటూ వెళ్తున్నాడనేది కాదనలేని వాస్తవం.

    2020లో అల వైకుంఠపురంతో

    2020లో అల వైకుంఠపురంతో

    2020 సంవత్సరంలో అల వైకుంఠపురంలో చిత్రంతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించాడు. ఈ చిత్రానికి కరోనావైరస్ సమస్య ఎదురు కాకపోతే ఇంకా భారీ కలెక్షన్లను వసూలు చేసి ఉండేదనే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయినా సుమారు 250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన అల్లు అర్జున్ తన బాక్సాఫీస్ రికార్డును మెరుగుపరుచుకొన్నారు.

    పుష్ప చిత్రంతో ప్యాన్ ఇండియా హీరోగా

    పుష్ప చిత్రంతో ప్యాన్ ఇండియా హీరోగా

    ఇక పుష్ప చిత్రంతో తన బాక్సాఫీస్ జోరును కొనసాగించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం సుమారు 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో దేశ సినీ పరిశ్రమలోని అందరి చూపు ఇప్పుడు అల్లు అర్జున్‌పై పడింది. బాలీవుడ్ నుంచి పలు భారీ ఆఫర్లు కూడా వచ్చినప్పటికీ ఆచితూచీ వ్యవహరిస్తున్నారు.

    లైకా ప్రోడక్షన్స్‌తో ప్యాన్ ఇండియా మూవీ

    లైకా ప్రోడక్షన్స్‌తో ప్యాన్ ఇండియా మూవీ

    ఇదిలా ఉండగా, పుష్ప మూవీ తర్వాత దక్షిణాదిలో ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ హౌస్ లైకాతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అల్లు అర్జున్‌తో భారీ బడ్జెట్‌గా ప్యాన్ ఇండియా సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగతున్నాయి. ఈ సినిమాకు తమిళంలోని స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నారు. ప్యాన్ ఇండియా స్థాయి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం ఈ టీమ్ చేస్తున్నది అని సినీ వర్గాలు వెల్లడించాయి.

    ఐకాన్ స్టార్‌కు 75 కోట్ల రెమ్యునరేషన్

    ఐకాన్ స్టార్‌కు 75 కోట్ల రెమ్యునరేషన్


    అయితే పుష్ప సినిమా వరకు అల్లు అర్జున్ సుమారు 50 కోట్ల మేర పారితోషికం తీసుకొన్నట్టు సమాచారం. అయితే లైకా రూపొందించే ప్యాన్ ఇండియా సినిమా కోసం సుమారు 75 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు తెలిసింది. అయితే పుష్ప తర్వాత ఆ రేంజ్ పారితోషికం తీసుకోవడం సమంజసమే అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    అల వైకుంఠపురంలో హిందీ డబ్బింగ్ 26వ తేదీన రిలీజ్

    అల వైకుంఠపురంలో హిందీ డబ్బింగ్ 26వ తేదీన రిలీజ్

    ఇదిలా ఉండగా, పుష్ప చిత్రం ఉత్తరాదిలో రికార్డు కలెక్షన్లు సాధించింది. కేవలం హిందీ వెర్షన్ పుప్ప 81.58 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. దీంతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్టామినా ఉత్తరాది ట్రేడ్ వర్గాలు స్పష్టమైంది. పుష్ప సాధించిన విజయంతో అల్లు అర్జున్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ విజయం సాధించిన అల వైకుంఠపురం డబ్బింగ్ వెర్షన్‌ను జనవరి 26న రిలీజ్ చేసి బన్నీ క్రేజ్‌ను క్యాష్ చేసుకొనేందుకు సిద్ధమవుతున్నారు.

    English summary
    Icon Star Allu Arjun commerical equations have been changed after Pushpa Hit, Now, He is in discussion with Lyca productions for pan India movie. As per Reports, Lyca offered 75 crores remuneration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X