Pushpa 2: పుష్ప సాంగ్‌లో గాజు గ్లాస్.. జనసేన గుర్తుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వివాదంలో పాట!
దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఏకైక చిత్రం పుష్ప 2. తగ్గేదేలే అంటూ పుష్ప ది రైజ్ సినిమాతో ఇండియావైడ్ సంచలన ప్రకంపనలు రేపాడు అల్లు అర్జున్. ఆ సినిమా దేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా రాజకీయ ప్రముఖులను క్రీడాకారుల్లో జోష్ పెంచింది.
అలాంటి క్రేజ్ ఉన్న పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప ది రూల్ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మే 1వ తేదీ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా పుష్ప..పుష్ప అనే పాటను రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో అల్లు అర్జున్ చేతిలో జనసేన గాజు గ్లాసు ఉండటం అందర్నీ విశేషంగా ఆకర్షిస్తున్నది. పాట సృష్టిస్తున్న ప్రకంపనల వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 సినిమాలోని పుష్ప పాట విడుదలైన వెంటనే రికార్డుస్థాయిలో వ్యూస్ సాధిస్తున్నది. ఈ పాటలో అల్లు అర్జున్ స్టైయిల్, సుకుమార్ మేకింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆ పాటలోని సాహిత్యం అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్టామినాకు తగినట్టుగా సమకూర్చారు. అయితే ఈ పాటలో అల్లు అర్జున్ చేతిలో గాజు గ్లాస్ పట్టించి.. టీ తాగించడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.
అయితే ఆంధ్రాలో ఎన్నికల కోలాహలం కొనసాగుతున్న వేళ ఈ పాటలో గాజు గ్లాస్ రావడం మరింత అటెన్షన్‌ను క్రియేట్ చేసింది. ఏపీలో గాజు గ్లాసు గుర్తు ప్రస్తుతం వివాదాస్పందంగా మారింది. జనసేన పోటీ లేని స్థానంలో స్వతంత్ర, రెబెల్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై కోర్టును కూడా ఆశ్రయించడం తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల మధ్య వచ్చిన పుష్ప పుష్ప పాటలో అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తుంటే.. ఒక వ్యక్తి క్యాన్‌లో టీ ఉన్న గాజు గ్లాసులు తీసుకు రావడం.. వాటిని స్టయిల్‌గా అల్లు అర్జున్ చేతిలో తిప్పుతూ విన్యాసం చేయడంతో జనసేన అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. పవన్ కల్యాణ్‌కు ఏదో విధంగా అల్లు అర్జున్ అండగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప పుష్ప పాటలో అల్లు అర్జున్ టీ ఉన్న గాజు గ్లాసును తీసుకొని..చేతిలో తిప్పుతూ కెమెరాకు రిజిస్టర్ అయ్యేలా చేయడం పవన్ అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ఈ క్రమంలో పుష్ప పుష్ప..పుష్ప రాజ్ పాటను మెగా అభిమానులు షేర్ చేస్తూ.. పాటను ట్రెండింగ్‌లో తెచ్చారు.
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, అనసూయ, ఫహద్ ఫాజిల్ తదితురులు
కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్
రిలీజ్ డేట్: 2024-08-15


Click it and Unblock the Notifications











