జానీ మాస్టర్‌కు ఆ పెద్ద హీరో చుక్కలు చూపించనున్నాడా? బాధితురాలికి సపోర్టు అందుకేనా?
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన అతడి సహాయకురాలు దాఖలు చేసిన ఫిర్యాదుపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా స్పందించింది. బాధితురాలు చేసిన ఫిర్యాదుపై సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపుల సంఘటనలపై పరిష్కారం చూపేందుకు సెక్సువల్ హరాష్‌మెంట్ రెడ్రస్సల్ ప్యానెల్ మీడియా సమావేశం నిర్వహించి.. ఇరు పార్టీల వాదనలు విన్నాం. వాటిపై నిజనిర్ధారణ కమిటీ విచారించి తగు నిర్ణయం తీసుకొంటామని వెల్లడించింది.ఈ సమావేశంలో నటి, యాంకర్ ఝాన్సీ, నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత దామోదర ప్రసాద్, సుచిత్ర చంద్రబోస్, వివేక్ కూచిబొట్ల, ప్రగతి మహావాడి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జరిగిన విషయాల్లోకి వెళితే..
తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ సభ్యురాలైన మహిళా కోరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ తనపై లైంగిక దాడి చేశారు అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొన్నాం. యూనియన్‌లో అధ్యక్షుడి హోదాలలో ఉన్న కొరియోగ్రాఫర్‌పై కమిటీ మధ్యంతర రిపోర్టు ఇచ్చింది. దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం అని అన్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు బాధితురాలు మీడియా ముందుకు వెళ్లింది. అయితే మీడియాను కలిసిన తర్వాత వారు తమ్మారెడ్డి భరద్వాజ, సుప్రియను కలవమని సహాయం చేశారు. దాంతో ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీని కలిసింది. ముందు ఆమె తనకు పని కల్పించాలని చెప్పింది. ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును పరిశీలిస్తున్నాం. అని చెప్పారు.
మీడియా సమావేశంలో యాంకర్ ఝాన్సీ మాట్లాడుతూ.. బాధితురాలికి ఒక పెద్ద హీరో సపోర్టుగా ఉన్నారు. తన మేనేజర్ ద్వారా సందేశం పంపించారు. ఆమె చేసే పోరాటంలో తాము అండగా ఉంటాం. మా ప్రాజెక్టుల్లో, మా బ్యానర్‌లో వచ్చే సినిమాలో అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది అని అన్నారు.

అయితే ఝాన్సీ చెప్పిన విషయాల తర్వాత ఆ పెద్ద హీరో ఎవరు? అనే చర్చ మొదలైంది. అయితే ఈ సమావేశం తర్వాత జానీ మాస్టర్ వల్ల బాధితురాలిగా మారిన అమ్మాయి వెనుక అల్లు అర్జున్ ఉన్నారనే విషయం మీడియాలోను అలాగే సోషల్ మీడియాలో పేరు ప్రచారం జరిగింది. అయితే ఆమె వెనుక ఉన్నారా? లేదా? అనే చర్చ జరుగుతున్న సమయంలో ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో కనిపించింది.
అయితే జనసేనలో కీలకంగా ఉన్న జానీ మాస్టర్‌కు చుక్కలు చూపించేందుకు ఐకాన్ స్టార్ రెడీ అవుతున్నారు. బాధితురాలికి అండగా నిలవడం అందులో భాగమే. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతను కలిసిన అల్లు అర్జున్‌పై ఆయన కొన్ని వ్యాఖ్యలు పరోక్షంగా చేశారు. అందుకే ఆయనపై కేసు నమోదైన క్రమంలో బాధితురాలికి అండగా నిలిచారనే విషయంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నది. అయితే అల్లు అర్జున్‌కు అలాంటి ఉద్దేశం లేదు. ఇప్పటికే తెలుగు అమ్మాయిలకు సపోర్టుగా ఉంటానని పలు సందర్భాల్లో చెప్పిన విషయాన్ని ఆయన వర్గీయులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











