చరణ్ ని ట్రోల్ చేస్తున్న అల్లు సంస్థ.. 100 కోట్ల ఫేక్ పై సెటైర్స్?
రీసెంట్ గా దక్షిణాది సినిమా నుంచి పలు పాన్ ఇండియా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో ఒకో సినిమా తెలుగు సహా హిందీ ఇంకా తమిళ మార్కెట్ లలో అదరగొట్టిన చిత్రాల్లో పుష్ప 2 ది రూల్ కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా రికార్డు వసూళ్లు అందుకోగా దీని తర్వాత వచ్చిన మరో కొత్త సినిమా అది కూడా మొదటి తెలుగు సినిమా "గేమ్ ఛేంజర్".
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ పాన్ ఇండియా సినిమా దర్శకుడు శంకర్ తో తెరకెక్కించిన సెన్సేషనల్ సినిమా ఇది కాగా ఈ సినిమా ఇపుడు ఊహించని వసూళ్లు అందుకుంది. కాగా ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సినిమాల్లానే ఈ సినిమాకి కూడా భారీ నెగిటివిటీ వచ్చింది. దీనితో గేమ్ ఛేంజర్ పై ఈ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువే కనిపించింది.

కాగా ఇవన్నీ నడుస్తున్నప్పటికీ మేకర్స్ డే 1 కి ఏకంగా 180 కోట్లకి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేయడం ఒక్కసారిగా చర్చకు దారి తీసింది. కాగా మన తెలుగు సినిమాలో ఫేక్ వసూళ్ల ముచ్చట అనేది ఇప్పుడు నుంచి ఉన్నది కాదు. ఎప్పుడు నుంచో ఉన్న పలు సినిమాలు రికార్డు వసూళ్లు అంటూ పోస్టర్స్ వేసి ఊదరగొట్టారు. అయితే ఈ ట్రెండ్ ఇపుడు అంతకంతకూ ముదురుతూ వచ్చింది అని చెప్పాలి.
ఈ ట్రెండ్ లో భాగంగా ఇచ్చే పోస్టర్స్ కేవలం అభిమానుల సంతృప్తి కోసమే అని చాలా మంది నిర్మాతలు కూడా చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇన్ని రోజులు వచ్చిన పోస్టర్స్ తో ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు కానీ గేమ్ ఛేంజర్ పోస్టర్ వచ్చాక మాత్రం దీనిని ఇతర హీరోల అభిమానులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అక్కడ నుంచి ఈ సినిమాపై నెగిటివ్ టాక్ గట్టిగా మొదలైంది.

గేమ్ ఛేంజర్ మేకర్స్ ఏకంగా 100 కోట్లు ఫేక్ చేశారు అంటూ ఇతర హీరోల అభిమానులు చాలా మంది సోషల్ మీడియాలో వాగ్వాదం చేస్తున్నారు. అయితే ఈ 100 కోట్లపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువ అభ్యతరం వ్యక్తం చేస్తుండగా.. మరి దేవర కి వేసుకున్న కలెక్షన్ నిజమని ఎలా నమ్మాలంటూ చరణ్ అభిమానులు అంటున్నారు.
ఇక ఈ గొడవలు ఇలా జరుగుతున్న సమయంలో అల్లు కాంపౌండ్ నుంచి ఓ క్రేజీ సెటైర్ సోషల్ మీడియాని షేక్ చేసింది. అల్లు కుటుంబానికి ఉన్న స్ట్రీమింగ్ సంస్థ ఆహా కోసం అందరికీ తెలిసిందే. కాగా వీరి నుంచి తమ యూజర్లకి ఒక నోటిఫికేషన్ రావడం మొదలైంది. "100 కోట్లు పోయాయి నువ్ హ్యాపీనా" అంటూ నోటిఫికేషన్ రావడం మొదలైంది.
దీనితో ఇది గేమ్ ఛేంజర్ కి లింక్ అయ్యేలా ఉందని. అలాగే గేమ్ ఛేంజర్ కి వేసుకున్న ఫేక్ వసూళ్లకే ఇది కౌంటర్ గా ప్లాన్ చేశారు అంటూ దీనిని వైరల్ చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ పై ఇలా ఆహా వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు సరైన టైమింగ్ చూసుకొని ట్రోల్స్ చేస్తున్నారని ఇతర ఫ్యాన్స్ హైలైట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











