‘అల్లుడు అదుర్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్: సినిమా విడుదల తేదీని మార్చుతున్నారా?

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు సాయి శ్రీనివాస్. 'అల్లడు శ్రీను' సినిమాతో గ్రాండ్‌గా లాంఛ్ అయినప్పటికీ.. అది అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత చేసిన 'స్పీడున్నోడు', 'కవచం', 'సీత', 'సాక్ష్యం' వంటి చిత్రాలు కూడా అతడికి హిట్‌ను అందించలేకపోయాయి. అయితే, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేసిన 'జయ జానకీ నాయక' మాత్రం పర్వాలేదనిపించింది. పక్కా ఫ్యామిలీ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో బెల్లంకొండ వారి అబ్బాయి నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.

ఇక, ఇటీవలే 'రాక్షసుడు' ద్వారా కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మూవీ ఇచ్చిన జోష్‌లో ప్రస్తుతం ఎనర్జిటిక్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న 'అల్లుడు అదుర్స్' అనే మూవీలో నటిస్తున్నాడు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గొర్రెల సుబ్రమణ్యం నిర్మిస్తోన్న ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమాన్యుయల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అలాగే, రియల్ హీరో సోనూ సూద్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఇది విడుదల కానుంది.

Is Alludu Adhurs Preponement to January 14th?

ఈ నేపథ్యంలో 'అల్లుడు అదుర్స్' సినిమా రిలీజ్ డేట్‌ను ముందుకు జరపబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి కానుకగా వస్తున్న చిత్రాల పోటీని తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ప్రీపోన్ అయితే మాత్రం ఒకరోజు వెనక్కి జరిపి జనవరి 14న దీన్ని విడుదల చేసే అవకాశం ఉందని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X