తెరపైకి కొత్త న్యూస్: అనిల్ రావిపూడి వరస్ట్ సెంటిమెంట్.. మహేశ్‌కు ప్లస్ అవుతుందా.?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, లేడీ అమితాబ్ విజయశాంతి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అలాగే, ప్రముఖ నిర్మాత కమ్ కమెడియన్ బండ్ల గణేష్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే...

మహేశ్‌కు సెంటిమెంట్లు ఎక్కువే
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీల్లో ఉన్న హీరోల్లో మహేశ్ బాబుకు అందరి కంటే ఎక్కువ సెంటిమెంట్లు ఉంటాయన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఆయన సినిమాలో ఏదో ఒక సెంటిమెంట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సెట్‌లు, క్యారెక్టర్ పేర్లు, సినిమా పేర్లు, విడుదల తేదీలు ఇలా ఎన్నో రకాలుగా ఆయన జాగ్రత్తలు తీసుకుంటారని ప్రచారం ఉంది.

విడుదలకు ముందే సత్తా చాటుతున్నాడు
ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. భారీ తారాగణంతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దీన్ని తెరకెక్కిస్తుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. వ్యూస్, లైక్స్‌తో సత్తా చాటిన ఈ టీజర్.. నాలుగు రోజుల పాటు ట్రెండ్ అయి చరిత్ర సృష్టించింది.

వారానికో సర్‌ప్రైజ్ రాబోతుంది
ఇప్పటికే టీజర్‌తో సంచలనం సృష్టించిన మహేశ్ బాబు అండ్ టీమ్.. సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇక నుంచి రాబోయే ప్రతి సోమవారం సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. ఇందులో భాగంగానే ‘సరిలేరు నీకెవ్వరు' చిత్రం నుంచి ప్రతి సోమవారం ఓ సర్‌ప్రైజ్ రాబోతుంది.

తెరపైకి సరికొత్త సెంటిమెంట్
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. గతంలో అనిల్ రావిపూడి డైలాగ్ రైటర్‌గా పని చేశాడు. అప్పుడు అతడు వెంకటేష్ ‘మసాలా', రవితేజతో ‘దరువు' అనే సినిమాలకు రచయితగా పని చేస్తే ఈ రెండూ ఫ్లాప్ అయ్యాయి. అయితే, డైరెక్టర్‌గా మాత్రం ఇద్దరు హీరోలకు ‘F2', ‘రాజా ది గ్రేట్' చిత్రాలతో హిట్లు అందించాడు.
Recommended Video

మహేశ్ కూడా వర్కౌట్ అవుతుందా?
ఇద్దరు హీరోల విషయంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయిన నేపథ్యంలో మహేశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం.. గతంలో అనిల్ రావిపూడి.. మహేశ్ బాబు నటించిన ‘ఆగడు' చిత్రానికి రచయితగా పని చేయడమే. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సెంటిమెంట్ ప్రకారం ‘సరిలేరు నీకెవ్వరు' హిట్ అవుతుందని వాళ్ల వాదన.


Click it and Unblock the Notifications











