Blessed With Baby పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క, విరాట్ దంపతులు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారనే విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. గత కొద్ది రోజులుగా అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ వ్యవహారం మీడియాలో చర్చ జరుగుతున్నది. అయితే తమ రెండో సంతానం విషయంపై ఈ స్టార్ సెలబ్రిటీలు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. కానీ అనుష్క శర్మ గర్బవతి అనే విషయాన్ని ఓ క్రికెటర్ అధికారికంగా ధృవీకరించారు. అయితే తాజాగా అనుష్క రెండో బిడ్డకు జన్మనిచ్చిందనే విషయాన్ని క్రిటిక్ బయటపెట్టాడు. ఆ తర్వాత విారాట్ కోహ్లీ అధికారికంగా తన రెండో సంతానం గురించి ట్వీట్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఓ యాడ్ షూటింగ్ సందర్భంగా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు వారిద్దరూ డేటింగ్ చేశారు. చివరకు 2017 సంవత్సరంలో డెస్టినేషన్ వెడ్డింగ్ పద్దతిలో ఇటలీలో వివాహం చేసుకొన్నారు. 2021 సంవత్సరంలో వారికి ఓ కూతురు జన్మించింది. ఆ చిన్నారికి వమికా అని నామకరణం చేయడం తెలిసిందే.

Is Anushka Sharma, Virat Kohli blessed with Baby Girl in London? Here is the Full Details

అయితే విరాట్ కోహ్లీ ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. అయితే ఇంగ్లాండ్ సిరీస్‌ నుంచి అర్దాంతరంగా తప్పుకోవడంతో అనుష్క శర్మ గర్బవతి కావడం వల్ల ఫ్యామిలీకి సమయం కేటాయించాలని భావించాడు. డెలివరీ సమయంలో ఆమె పక్కన ఉండాలని కోరుకొంటున్నాడనే విషయం బయటకు వచ్చింది.

అనుష్క శర్మ గర్బవతి అనే విషయంపై క్లారిటీ లేక అనేక గాసిప్స్ మీడియాలో ప్రచారం అవుతుంటే.. క్రికెట్ ఏబీ డివిలియర్స్ .. విరాట్ కోహ్లీ భార్య ప్రెగ్నెంట్ అంటూ అధికారికంగా ధృవీకరించాడు. అనుష్క శర్మ త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్నారు. అందుకే ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చి ఇంగ్లాండ్ సిరీస్ నుంచి విరాట్ తప్పుకొన్నాడు అని డివీలియర్స్ తన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అయితే అనుష్క శర్మ ప్రస్తుతం లండన్‌లోనే ఉంటున్నది. ఆమె యోగాక్షేమాలు తెలుసుకొంటూ విరాట్ కోహ్లీ కూడా అక్కడే ఉన్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. అనుష్క, విరాట్ దంపతులు ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తొలిసారి ఆడ బిడ్డకు జన్మనిస్తే.. తాజాగా మగబిడ్డకు జన్మినిచ్చారు. పాప, తల్లి క్షేమంగా ఉన్నారంటూ విరాట్ కోహ్లీ, ఉమేర్ సంధూ ట్వీట్లు చేసి అధికారికంగా ధృవీకరించారు.

Is Anushka Sharma, Virat Kohli blessed with Baby Girl in London? Here is the Full Details

అనుష్క శర్మ కెరీర్ విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత ఆమె దాదాపు సినిమాల్లో నటించడానికి దూరంగా ఉన్నారు. 2018లో జీరో సినిమాలో ఆమె కనిపించారు. తన కూతురు వమికా పుట్టిన తర్వాత నిర్మాతగా మారారు. ప్రస్తుతం ఓ క్రికెటర్ బయోపిక్.. చక్ దా ఎక్స్‌ప్రెస్ అనే చిత్రంలో నటించారు. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X