ఇండియాకు అనుష్క శర్మ గుడ్‌బై.. ఇక విరాట్‌తోనే ఆ దేశంలోనే శాశ్వతంగా!
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు దేశం విడిచిపోయారనే వార్తలు అభిమానులకు షాకింగ్‌గా మారాయి. ఇటీవలే విరాట్ కోహ్లీ తన క్రికెట్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ అభిమానులకు షాకింగ్ కలిగించింది. అయితే ఈ ఇద్దరు సెలబ్రిటీలు వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన వెంటనే లండన్‌కు వెళ్లిపోయారు. దాంతో విరాట్ కోహ్లీ, అనుష్క ఇద్దరు కూడా ఇండియాను వదిలేస్తున్నారు అనే వార్తలు జోరందుకొన్నాయి. అయితే ఆ వార్తలపై అనుష్క శర్మ చేసిన పోస్టు మరింత అనుమానాలు క్రియేట్ చేశాయి. ఆ వివరాల్లోకి వెళితే..
ఇండియాలో వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ కొనసాగుతుండగానే.. ఉన్నట్టుండి.. విరాట్ కోహ్లీ వాటికి దూరంగా లండన్‌లో తేలాడు. విరాట్ లండన్‌లో ఉన్నాడు అంటూ అనుష్క శర్మ ఫోటోలు షేర్ చేసింది. అయితే ప్రైవేట్ జీవితాన్ని ఆస్వాదించడానికే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకొన్నాడు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దేశం కోసం విపరీతంగా క్రికెట్ ఆడటం వల్ల అలసిపోయిన విరాట్ ఇక నుంచి తన ఫ్యామిలీకి సమయం కేటాయించాలని అనుకొంటున్నారు. వ్యక్తిగత జీవితానికి ఎలాంటి ఆటంకం కలగని దేశం యూకేను తన అడ్రస్‌గా మార్చుకోబోతున్నాడు. అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకొంటున్నారనే న్యూస్ ఇండియన్ మీడియాలో బలంగా వినిపించాయి.
ఇక క్రికెట్ కాకుండా తన మిగితా జీవితంలో కేవలం తన పిల్లలు వమికా, అకాయ్‌తో గడపాలని నిర్ణయించుకొన్నాడు. గతంలో క్రికెట్ సిరీస్ నుంచి విరామం తీసుకొని ఇండియాలో ఉన్నాడు. తన భార్య ప్రసవం సమయంలో వెంట ఉన్నాడు. అయితే తన ఫ్యామిలీకి, అనుష్కకు టైమ్ కేటాయించలేదనే ఫీలింగ్‌తో ఉండటం వల్ల ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉన్నా ఈ కారణంగా రిటైర్ ప్రకటించారు అనే వాదన వినిపించింది.

తాజాగా లండన్‌లో శాశ్వతంగా ఉండేందుకు అనుష్క ఏర్పాట్లు చేసుకొన్నది. అందుకే తన ఇద్దరు పిల్లలతో కలిసి లండన్‌లో జీవించడానికి కావాల్సిన వసతులను సమకూర్చుకొంటున్నారు. లండన్ నుంచే అనుష్క బాలీవుడ్‌లో సినిమాల్లో నటించడం గానీ.. లేదా నిర్మాతగా సినిమాలు తీయడం గానీ చేస్తుందని అంటున్నారు. ఇక క్రికెట్ రంగానికి అక్కడి నుంచే సేవలందిస్తారని పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, లండన్‌లో విరాట్ కొనసాగిస్తున్న సాధారణ జీవితానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. వీధుల్లో తిరుగుతూ అడిగిన అభిమానులకు ఫోటోలు, సెల్ఫీ ఇస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నట్టు కనిపించాడు. అయితే ఇండియాకు దూరంగా ఉండాలనే నిర్ణయం మాత్రం అభిమానులను బాధిస్తుందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











