తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు ఇవ్వను.. ఆ హీరోయిన్‌తో బేబీ నిర్మాతకు చేదు అనుభవమా?

'బేబీ' చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత ఎస్కేఎన్. 'బేబీ' మూవీతో దాదాపుగా రూ.100 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి చిన్న సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేసే నిర్మాతల్లో ఒకరిగా చోటు సంపాదించుకున్నారు. ఇప్పటికే నిర్మాత కంటెంట్ నమ్ముకొని తక్కువ బడ్జెట్ లోనే ప్రయోగాత్మకంగా సినిమాలు చేస్తుంటారు. ఇదే బాటలో ఎస్కేఎన్ కూడా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎస్కేఎన్ స్పీడ్ చూస్తుంటే ఎప్పటికైనా స్టార్ ప్రొడ్యూసర్ గా సెన్సేషనల్ అవుతారనే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. బేబీ నిర్మాతగా ఎస్కేఎన్ చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమా వేదికలపై ఆయన మాట్లాడే మాటలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. ఏదో రకంగా ఎప్పుడూ సోషల్ మీడియాలో నిర్మాత ఎస్కేఎన్ పేరు గట్టిగానే వినిపిస్తుంటుంది. ఇక తాజాగా మరోసారి ఆసక్తికరమైన స్పీచ్ ఇచ్చి ట్రెండింగ్ లో ఉన్నారు. ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఎస్కేఎన్ తెలుగు హీరోయిన్లపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన సినిమాల్లో తెలుగు హీరోయిన్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వనని తెగేసి చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది.

Is any Issue between Vaishnavi Chaitanya Baby Movie Producer SKN

'డ్రాగన్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన నిర్మాత ఎస్కేఎన్ ఈ తరహా స్పీచ్ ను ఇచ్చారు. డ్రాగన్ మూవీ హీరోయిన్ కు వేదికపై నుంచే చెబుతూ.. మేము తెలుగు వచ్చిన హీరోయిన్ల కంటే.. తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తాం. ఎందుకంటే.. తెలుగు వచ్చిన అమ్మాయిని ఎంకరేజ్ చేస్తే ఏం అవుతుందో తర్వాత నాకు తెలిసింది. ఇప్పటి నుంచి తెలుగు రాని అమ్మాలనే ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నాం.' అని మాట్లాడారు. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా మారాయి. అయితే ఎస్కేఎన్ ఏ హీరోయిన్ ఉద్దేంచి ఈ వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గతంలో తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్యతో 'బేబీ' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీతో అటు నిర్మాతకు, ఇటు వైష్ణవికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే బేబీ హిట్ తర్వాత కూడా వైష్ణవితో నిర్మాత ఎస్కేఎన్ తన సొంత బ్యానర్ మాస్ మూవీ మేకర్స్ లో పలు సినిమాలను ప్లాన్ చేసినట్టు అప్పట్లో తెలిసింది. అయితే నెక్ట్స్ నిర్మాత అప్ కమింగ్ దర్శకుడు కృష్ణతో సినిమా చేయబోతున్నారని ఇదివరకే ప్రకటించారు. ఆ సినిమాలోనే బేబీని హీరోయిన్ గా ప్రమోట్ చేసినట్టు తెలుస్తోంది. కానీ వైష్ణవి చైతన్య డేట్స్ ఇవ్వకపోవడం, లేదంటే నిర్మాతతో వైష్ణవికి మరేదైనా గొడవ అయ్యిందా? అనే కోణంలో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావాలని నినదిస్తున్న తరుణంలో ఎస్కేఎన్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. ఇక వైష్ణవి చైతన్య ప్రస్తుతం సితార ఎంటర్ టైన్స్ మెంట్ బ్యానర్ లో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ సరసన 'జాక్' చిత్రంలో కలిసి నటిస్తోంది.

More from Filmibeat

Read more about: vaishnavi chaitanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X