BRO మూవీపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల ప్రభావం? ఏపీలో సినిమాను అడ్డుకొనేందుకు వాలంటిర్లు!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాజకీయ వాతావరణం వేడెక్కింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నది. అధికార పార్టీపై జనసేన అధినేత చేస్తున్న విమర్శలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల పై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు త్వరలోనే రిలీజ్ కానున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ బ్రోపై ఎలాంటి ప్రభావం పడబోతుందనే విషయం భారీ చర్చకు దారి తీసింది. ఆ చర్చకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్ చేపట్టిన రెండో విడుత వారాహి విజయ యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో రసవత్తరంగా సాగుతున్నది. పవన్ కల్యాణ్ సభలకు భారీగా జనం పోటెత్తుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య వాలంటీర్ల సేవలపై పవన్ కల్యాణ్ లేవనెత్తిన అనుమానాలపై ప్రస్తుతం నిరసన పర్వం కొనసాగుతున్నది.

Is AP volunteers issue impact on Pawan Kalyans Bro the avatar movie?

పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. ప్రతీ విమర్శలు, ఘాటైన వ్యాఖ్యలతో వాలంటీర్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.

ఏపీలో అనేక ఉద్రిక్తతలు, ఆందోళనల మధ్య పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతున్నది. అయితే జూలై 28వ తేదీన పవన్ కల్యాణ్ నటించిన బ్రో (Bro The Avatar) సినిమా రిలీజ్‌కు సిద్దమవుతున్నది. అయితే ఈ సినిమాను అడ్డుకొనేందుకు వైసీపీ వర్గాలు, వాలంటీర్లు సిద్దమవుతున్నట్టు సమాచారం. బ్రో సినిమాను బహిష్కరించాలనే దిశగా ప్రయత్నాలు చేపట్టినట్టు తెలుస్తున్నది.

Is AP volunteers issue impact on Pawan Kalyans Bro the avatar movie?

అయితే బ్రో సినిమాను ఏదో రకంగా అడ్డుకొంటారనే విషయంపై జనసేన వర్గాలకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. అయితే అలాంటి ప్రయత్నాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు పవన్ అభిమానులు సిద్దమవుతున్నారు. టీడీపీ శ్రేణులు కూడా బ్రో సినిమాకు మద్దతు తెలిపేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

ఏపీలో వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రాలో గ్రాఫ్ పెరిగినట్టు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏపీ ప్రజల దృష్టిని తనవైపు మరల్చుకోవడంలో పవన్ వ్యూహం వర్కువుట్ అయింది. ఒకవేళ బ్రో సినిమాకు ఆటంకాలు, అడ్డంకులు కల్పించే దిశగా అడుగేస్తే.. పవన్ కల్యాణ్‌కు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నట్టు సమాచారం. అయితే బ్రో మూవీ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X