సమంత, నాగచైతన్య ఫోన్ ట్యాపింగ్.. వేణుస్వామి నిజస్వరూపం ఇదే అంటూ!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో మీడియా వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. జాతకాల పేరుతో సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలపై ఆయనపై తెలంగాణ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు నమోదు కావడం తెలిసింది. తనపై ఫిర్యాదు చేశారనే కారణంతో జర్నలిస్టులపై అవాస్తవాలతో వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వీడియోలు రిలీజ్ చేశారు. అయితే వేణుస్వామి తన జ్యోతిష్యం పేరుతో చేస్తున్న గారడీని తాజాగా ప్రముఖ టెలివిజన్ ఛానెల్ బయటపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..
వేణుస్వామి జ్యోతిష్యం సంబంధం లేకుండా ఊహాగానాలు, ఇతర వ్యక్తుల నుంచి నిఘా సమాచారాన్ని అందుకొని సినీ, రాజకీయ ప్రముఖులపై జ్యోతిష్యం చెబుతారు. ఆయన చెప్పిన ఏ ఒక్క జాతకం కూడా రుజువు కాలేదు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన జోస్యాలు కూడా ఫలించకపోవడంతో ఆయన చెప్పిన విషయాలు కామెడీగా మారాయి.

గతంలో ప్రభాస్‌కు ఇక హిట్టు ఉండదు. పవన్ కల్యాణ్ ఎన్నటికీ గెలువడు. వైఎస్ జగన్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అధికారం, సమంత, నాగచైతన్య విడిపోతారు అంటూ కొన్ని జోస్యాలు చెప్పారు. అయితే సమంత, చైతూ విషయంలో కరెక్ట్ కావడంతో దాన్ని తన బలంగా చెప్పుకొంటూ తిరిగారు.
ఇక సమంత, చైతూ విషయంలో ఆయన గ్రహాలు, జాతకాలు చూసి జ్యోతిష్యం చెప్పలేదు. పోలీసు, ఇతర ప్రభుత్వ అధికారులకు విందులు ఇచ్చి.. వారు ఆ పార్టీలో చెప్పే విషయాల ఆధారంగా సెలబ్రిటీల జాతకాలు డిజైన్ చేస్తాడు. ఓ పార్టీలో సమంత, నాగచైతన్య ఫోన్ టాపింగ్ చేసిన అధికారులు చెప్పిన విషయాలను బట్టి ఆయన వారి జ్యోతిష్యం చెప్పారు అని ప్రముఖ ఛానెల్ తన కథనంలో పేర్కొన్నది.
ఇలా పోలీసు అధికారులు, నిఘా అధికారులు చెప్పిన కొన్ని విషయాలతో ఆయన సెలబ్రిటీలను భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. అదే సమాచారం ఆధారంగా సమంత, నాగచైతన్య ఫోన్ ట్యాపింగ్ ఆధారం చేసుకొని వారి జాతకాలను చూసినట్టు బిల్డప్ ఇచ్చారని ఆయన నిజస్వరూపాన్ని ప్రముఖ జర్నలిస్టు మూర్తి బట్టబయలు చేశారు.


Click it and Unblock the Notifications











