Sunita Williams: వెండితెరపై సునీతా విలియమ్స్.. బయోపిక్ కోసం భారీ ప్లానింగ్!

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమికి చేరుకోనున్నారు. దాదాపు 9 నెలలపాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఆమె స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అనే వ్యోమ నౌక ద్వారా భూమికి చేరుకొంటారు. ఇప్పటికే వీరు ప్రయాణించే వ్యోమనౌక అంతరిక్ష కేంద్రాన్ని వీడి భూమివైపు పరుగులు పెడుతున్నది. ఇలాంటి సాహోసోతమైన అంతరిక్ష యాత్రను చేపట్టి అందరికి స్పూర్తిగా నిలిచిన సునీతా విలియమ్స్‌ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం వెలుగు చూసింది. సునీతా విలియమ్స్ జీవితం, అలాగే ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సునీతా విలియమ్స్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన వాడు. ఆమె తండ్రి న్యూరో అనామిస్ట్‌గా వైద్య వృత్తిని కొనసాగించారు. ఆయన స్లోవేకియాకు చెందిన ఉర్సులైన్ బోన్ని పాండ్యాను వివాహం చేసుకొన్నారు. వారికి సునీతా, జేయ్ థామస్, దినా ఆనంద్ సంతానం కలిగారు.

Sunita Williams life story

సునీతా విలియమ్స్ 1965, సెప్టెంబర్ 19వ తేదీన ఒహియోలో జన్మించారు. ఆమె నీదమ్ హై స్కూల్ విద్యను 1983లో పూర్తి చేశారు. ఆ తర్వాత 1987లో యూఎస్ నావల్ అకాడమీ నుంచి ఫిజికల్ సైన్స్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ పూర్తి చేసుకొన్నారు. అనంతరం ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూటుట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్ డిగ్రీ పుచ్చుకొన్నారు. ప్రస్తుతం 59 ఏళ్ల వయసులో అత్యధిక స్పేస్ వాక్స్ సాధించిన ఆస్ట్రోనాట్‌గా రికార్డు సృష్టించారు.

సునీతా విలియమ్స్ జూన్ 5వ తేదీ 2024న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్‌లో తన సహచరుడు విల్మోర్‌తో కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) కు చేరుకొన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారం వారిద్దరూ వారం రోజులకే భూమికి చేరుకోవాలి. కానీ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగి వచ్చింది. దాంతో వారిద్దరూ ఐఎస్ఎస్‌లోనే చిక్కుకుపోయారు.

Take a Poll

అలా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకొన్న సునీతా విలియమ్స్, విల్మోర్‌ను క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా భూమికి తీసుకు వస్తున్నారు. వారు బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకు ఫ్లోరీడా సముద్ర జలాల్లో దిగుతుంది. అలా దిగిన వ్యోమ నౌక నుంచి వారిని సహాయ బృందాలు బయటకు తీసుకొస్తారు.

ఇలాంటి సాహోసోపేతమైన యాత్రను చేపట్టిన సునీతా విలియమ్స్ జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నాలు హాలీవుడ్, ఇండియన్ సినిమా రంగంలో ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుసున్నది. అయితే ఇప్పటికే కొంత మేరకు ఉన్న సమాచారంతో రచయితలు, దర్శకులు తన కలాలకు పదును పెడుతున్నారు అని తెలిసింది. ఇదే నిజమైతే ఆమె జీవితంతో ఎంతో మందికి స్పూర్తిని కలిగించడం ఖాయం.

FAQs
సునీతా విలియమ్స్ ఇప్పటి వరకు ఎన్ని ఎక్స్‌పెడిషన్స్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లింది?

33

సునీతా విలియమ్స్ పాల్గొన్న కమర్షియల్ క్రూ ప్రొగ్రాం ఎప్పుడు భూమికి చేరింది?

మార్చి 18, 2025

సునీతా విలియమ్స్ పాల్గొన్న కమర్షియల్ క్రూ ప్రొగ్రాంను ఎప్పుడు లాంచ్ చేశారు?

2015

సునీతా విలియమ్స్ ఇప్పటి వరకు ఎన్ని గంటల స్పేస్ వాక్ చేశారు?

62 గంటల 6 నిమిషాలు

సునీతా విలియమ్స్‌కు భారత ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత అవార్డు ఏంటి?

పద్మభూషణ్

సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా భారత్‌లో ఏ రాష్ట్రానికి చెందిన వారు?

గుజరాత్

సునీతా విలియమ్స్ పుట్టిన రోజు ఎప్పుడు?

సెప్టెంబర్ 19, 1965

Filmibeat Entertainment

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X