జూ.ఎన్టీఆర్ ను మడితేసిన బాలయ్య? యంగ్ టైగర్ పై అంత కోపమా?
తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ కుటుంబాలు కొన్ని ఉన్నాయని అందరికీ తెలిసిందే. కాగా ఈ కుటుంబాల్లో నందమూరి కుటుంబం అలాగే మెగా కుటుంబం కూడా ఒకటి. అయితే ఎప్పుడు నుంచో నందమూరి కుటుంబంలో టాప్ హీరోస్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అలాగే నటసింహం బాలకృష్ణ నడుమ పలు కోల్డ్ వార్ లు ఉంటూనే ఉన్నాయని టాక్ ఉంది.
అలా ఎన్నో ఏళ్ళు నుంచి ఇది కొనసాగుతూ ఉండగా మధ్యలో మెగా కుటుంబం నుంచే వచ్చిన హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా మెగా హీరోస్ నడుమ వచ్చిన చిచ్చుతో ఇది డైవర్ట్ అయ్యినట్టు అయ్యింది. కానీ మళ్ళీ నందమూరి కుటుంబంలో ఈ కలహాలు ఇలానే ఉన్నాయి అనేది ఆసక్తిగా మారింది.

కాగా రీసెంట్ గానే బాలయ్య సెన్సేషనల్ హిట్ టాక్ షో అయినటువంటి అన్ స్టాప్పబుల్ సీజన్ 4 లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలయ్య అవమానకరంగా ప్రవర్తించారు అని షోలో తారక్ ప్రస్తావన వస్తే కావాలనే బాలయ్య దాటవేశారని సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడిచింది. కాగా దానికి మేకర్స్ వెంటనే డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు మధ్యలో బాలయ్య తారక్ కోసం అడిగారని అలాగే సోషల్ మీడియాలో ఏదైతే ఎన్టీఆర్ విషయంలో వైరల్ అవుతుందో అది నిజం కాదని చెప్పుకొచ్చారు.
కాగా ఇది అయ్యింది అనుకునే లోపే మరో ట్విస్ట్ బయటకి వచ్చింది. కాగా ఓ ఈవెంట్ లో బాలయ్య చేతికి తన పార్టీకి చెందిన ఒక కేలండర్ లాంటిది ఇస్తే అందులో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో చూసి దానిని అక్కడక్కడే మడత పెట్టేసేశారని ఎన్టీఆర్ కి బాలయ్యకి ఇంకా పడట్లేదు అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది.
సీనియర్ ఎన్టీఆర్ బాలయ్య అలాగే బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ మాత్రమే ఉన్నారు. కాగా మోక్షజ్ఞ స్టిల్ చూసేందుకు తారక్ లా ఉండేసరికి దానిని చూసి బాలయ్య కోపంతో మడతేశారు అంటూ సోషల్ మీడియాలో బాలయ్య, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నడుమ గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ వీడియోలో ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని చెప్పాలి.
కాగా బాలయ్య నటించిన లేటెస్ట్ సినిమా "డాకు మహారాజ్" ఈ సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో రిలీజ్ కి రాగా భారీ ఓపెనింగ్స్ ని ఈ చిత్రం సాధించింది. అలాగే ఈ సినిమాని దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గ్లామర్ రోల్ లో సహా హాట్ ఐటెం సాంగ్ లో కూడా కనిపించింది. అలాగే దర్శకుడు త్రివిక్రమ్, సూర్య దేవర నాగవంశీలు నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











