విజయ్ దేవరకొండపై నోరు పారేసుకొన్న బండ్ల గణేష్.. వార్నింగ్ ఇస్తే వర్కవుట్ కాదు అంటూ

ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌పై అభిరుచి గల నిర్మాత రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం K Ramp. యువ హీరో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర్ నటులు వీకే నరేష్, కామా జెఠ్మలానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి పండుగ కానుకగా ఈ మూవీ ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్దమైంది.

K ర్యాంప్ సినిమా ప్రమోషన్స్ పరంగా ఆకట్టుకొంటూ దూసుకుపోయింది. ప్రోమోలు, టీజర్, ట్రైలర్లకు భారీ స్పందన వచ్చింది. హీరో కిరణ్ అబ్బవరం, వీకే నరేష్ చేసిన ప్రమోషన్స్ బాగా వర్కవుట్ కావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా బ్రహ్మ కడలి, యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పృథ్వీ, ఎడిటర్‌గా ఛోటా కె ప్రసాద్, సినిమాటోగ్రాఫర్‌గా సతీష్ రెడ్డి మాసం, మ్యూజిక్ డైరెక్టర్‌గా చేతన్ భరద్వాజ్ బాధ్యతలను నిర్వహించారు. ఈ సినిమా 40 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద రాబట్టిన సందర్భంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ..

Bandla Ganesh Targets Vijay Deverakonda

సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్ ఇస్తే వర్కవుట్ కాదు. రాజకీయాల్లోనే వర్కవుట్ అవుద్ది. ఇక్కడ రిక్వెస్ట్ మాత్రమే ఉండాలి అని నిర్మాత రాజేశ్ దండా, శివలకు సూచించారు. ఈ సందర్భంగా కే ర్యాంప్ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఆలాగే వరుస హిట్లు కొట్టాలని కిరణ్ అబ్బవరంకు ఆశీస్సులు అందజేశారు. ఒక్క హిట్టు కొడితే.. వాట్సప్ వాట్సప్ అంటూ కొందరు కాలు మీద కాలు వేసుకొని స్టైల్ కొడుతుంటారు. అర్ధరాత్రి నల్ల కళ్లద్దాలు పెట్టుకొంటారు. ఒక్క హిట్ పెడితే.. లూజ్ ప్యాంట్స్.. కొత్త కొత్త చెప్పులు వేసుకొంటారు. కిరణ్ అబ్బవరం అలాంటి వాడు కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్.. ఫ్రంట్ గ్రౌండ్ లేని వ్యక్తి అని బండ్ల గణేష్ అన్నారు.

రాయచోటిలో ఒక చిన్న కుటుంబంలో పుట్టిన కిరణ్ రెడ్డి అబ్బవరం, బెంగళూరులో జాబ్ చేస్తూ.. నటుడు కావాలని కలకన్నాడు. కష్టపడి ఎదిగిన కిరణ్‌లో నిజాయితీ నాకు ఇష్టం. యూత్ అందరికీ ఒకటే చెబుతున్నా, మనసుకు నచ్చింది చేయండి. తల్లిదండ్రులు అది చేయాలి, ఉద్యోగం చేయాలంటే పట్టించుకోకుండా మీ మనసుకు నచ్చిన పని మీరు చేయండి. సినిమా తల్లి లాంటిది, ఈ తల్లిని నమ్ముకుంటే ఎవ్వరూ చెడిపోలేదు అని బండ్ల గణేష్ తెలిపారు.

Bandla Ganesh

కిరణ్ అబ్బవరం మన ఇంటి కుర్రాడిలా, మన తమ్ముడిలా అనిపిస్తాడు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన కిరణ్‌ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. కిరణ్ అబ్బవరంను చూస్తే తనకు చిరంజీవి గారు గుర్తుకు వస్తున్నారు. 150 సినిమాలు చేసిన చిరంజీవి గారు ఇంకా గ్రౌండ్ మీదనే ఉంటారు. కాబట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి. కిరణ్ క్యారెక్టర్, యాక్టింగ్, స్టైల్ అన్నీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని బండ్ల గణేష్ చెప్పారు.

కిరణ్ అబ్బవరం కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నందుకు అభినందించారు. ఆయన వరుసగా ఆరుగురు కొత్త డైరెక్టర్లను పరిచయం చేసి హిట్ కొట్టాడు. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వకపోతే మనం ఇండస్ట్రీకి వచ్చేవాళ్లమా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ గతాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రేమతో కష్టపడి పనిచేస్తే బ్లాక్ బస్టర్ ఖాయం. వెయి కోట్లు ఇచ్చిన గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వలేరు అని బండ్ల గణేష్ అన్నారు. అయితే వాట్సప్.. వాట్సప్ అనే హీరో అంటే.. విజయ్ దేవరకొండనే బంగ్ల గణేష్‌ను టార్గెట్ చేశాడనే విషయాన్ని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X