Divorce: విడాకుల కోసం 30 కోట్లు డిమాండ్.. రెండో భార్యతో పీకల్లోతు కష్టాల్లో స్టార్ హీరో!

సినిమా పరిశ్రమలో డేటింగ్, అఫైర్లే కాకుండా విడాకుల వార్తలకు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. జయం రవి, గతంలో సమంత, నాగచైతన్య, తాజాగా శర్వానంద్ లాంటి తారల విడాకుల వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. కేవలం తెలుగు, దక్షిణాది, ఉత్తరాది పరిశ్రమలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా స్టార్ హీరోల దాంపత్య జీవితంలో విభేదాలు బయటకు వస్తున్నాయి. అయితే భోజ్‌పురి భాషాకు సంబంధించిన సినీ రంగంలో పవర్ స్టార్ అనే పేరు ఉన్న స్టార్ హీరో దాంపత్య జీవితం కూడా వైఫల్యం దిశగా సాగుతున్నది. భార్యతో ఉన్న విభేదాల కారణంగా విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన నుంచి భారీగా భరణాన్ని ఆశిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ వార్తల వివరాల్లోకి వెళితే..

భోజ్‌పురి భాషలో పవర్ స్టార్‌గా పాపులారిటీ ఉన్న యాక్టర్, పొలిటిషియన్ పవన్ సింగ్ విడాకుల కేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. గత కొద్దికాలంగా భార్య జ్యోతి సింగ్ ఆయనపై అనేక విమర్శలు, ఆరోపణలు చేస్తూ మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షించారు. అయితే ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న సమయంలో, అలాగే ఆయన కీలకంగా మారిన ఎలక్షన్ సమయంలో జ్యోతిసింగ్ భారీగా భరణం చెల్లించాలంటూ బాంబు వేశారు.

Jyoti Singh demanded 30 Crores in Alimony

పవన్ సింగ్‌కు రెండో భార్య జ్యోతి సింగ్ విడాకుల నేపథ్యంలో ఆయన మొదటి భార్య విషయం మీడియాలో సంచలనం రేపుతున్నది. ఆయనకు తొలుత నీలమ్ దేవీ అనే మహిళతో వివాహం జరిగింది. దాంపత్య జీవితం సజావుగా సాగుతుందని భావిస్తున్న సమయంలో ఆమె అనూహ్యంగా సూసైడ్ చేసుకొని మరణించారు. ఆ ఘటన భోజ్‌పురి సినీ, రాజకీయ రంగాలను తీవ్రమైన సంచలనం రేపింది.

ఇక మొదటి భార్య మరణం తర్వాత జ్యోతి సింగ్‌కు మానసికంగా, శారీరకంగా దగ్గరయ్యారు. అయితే 2018 సంవత్సరంలో జ్యోతి సింగ్. పవన్ సింగ్ వివాహం జరిగింది. అయితే త్వరలోనే వారి వైవాహిక జీవితంలో కలతలు చెలరేగాయి. భర్తపై ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. తన మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. రెండుసార్లు నన్ను అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేశాడు అంటూ ఆమె ఆరోపణలు చేసింది. వాటిని ఆయన ఖండించడం మరింత వివాదంగా మార్చింది.

Jyoti Singh demanded 30 Crores in Alimony

అయితే ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణల తర్వాత 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో జ్యోతి సింగ్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. అయితే ఆయన నుంచి వస్తున్న వేధింపులు తట్టుకోలేక తాను 25 నిద్ర మాత్రలు మింగి సూసైడ్‌కు ప్రయత్నం చేశాను అంటూ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె ఆరోపణలను పవన్ తిప్పి కొట్టేందుకు ప్రయత్నించారు.

అయితే గత మూడు, నాలుగు సంవత్సరాలుగా కోర్టులో కొనసాగుతున్న విడాకుల కేసు ప్రస్తుతం మరోసారి మీడియాలో తెరపైకి వచ్చింది. పవన్ సింగ్ నుంచి 30 కోట్ల రూపాయల భరణాన్ని ఆశిస్తున్నారు అనేది జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 30 కోట్ల రూపాయలు చెల్లిస్తే.. తాను విడాకులు ఇచ్చేస్తాను అంటూ తన తరఫు న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తున్నది. ఆమె తరఫున న్యాయవాది మీడియాలో వస్తున్న ఈ వార్తలను కూడా ధృవీకరించడం మరింత ఆసక్తికరమైన పరిణామంగా మారింది.

More from Filmibeat

Read more about: bhojpuri Pawan Singh jyoti singh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X