Saptagiri రాజకీయాల్లోకి కమెడియన్ సప్తగిరి.. టీడీపీ నుంచి ఎన్నికల బరిలో? ఎక్కడి నుంచి పోటీ అంటే?

సినిమా పరిశ్రమలో స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు, కమెడియన్ సప్తగిరి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలతో ఒక్కొ మెట్టు ఎక్కుతూ ఓ దశలో స్టార్ కమెడియన్‌గా మారారు. సూపర్ స్టార్స్, స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలు అనే తేడా లేకుండా అందరితో నటించి ఇండస్ట్రీలో మంచి ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే రానున్న ఏపీ ఎలక్షన్ల భాగంగా సప్తగిరి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే వార్త వైరల్ అయింది. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించిన బొమ్మరిల్లు సినిమా ద్వారా సప్తగిరి నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ తర్వాత పరుగు సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించాడు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, ప్రేమ కథా చిత్రం, లవర్స్, సినిమా చూపిస్త మావ, కొత్త జంట సినిమాలతో కమెడియన్‌గా చెలరేగిపోయాడు.

Saptagiri-from-Chittoor

టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా కొనసాగుతుండగానే.. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్రం ద్వారా హీరోగా మారాడు. తొలుత ఈ సినిమాకు కాటమరాయుడు అని పెట్టాలనుకొని టైటిల్ రిజిస్టర్ చేశారు. కానీ పవన్ కల్యాణ్ రిక్వెస్ట్ మేరకు టైటిల్ మార్చుకొని... పవర్ స్టార్ ఆశీస్సులతో సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకొన్నాడు.

 Chittoor constituency from TDP

ఆ తర్వాత కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే హీరోగా సప్తగిరి ఎల్‌ఎల్‌బీ మూవీతో వచ్చి తన ఖాతాలో మరో హిట్ వేసుకొన్నాడు. సప్తగిరి LLB మూవీలో ఆయన ఫెర్ఫార్మెన్స్‌కు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రేక్షకుల ఆదరణ అభిమానాలతో సప్తగిరి హీరో, నటుడిగా కొనసాగుతున్నారు. ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాకు నంది అవార్డు అందుకొన్నారు. 2017లో అల్లు రామలింగయ్య స్మారక అవార్డును అందుకొన్నారు.

అయితే గత కొద్దికాలంగా సప్తగిరి పేరు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. 2024 ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేయనున్నారనే విషయంపై కథనాలు వినిపించాయి. అయితే తాజాగా టీడీపీ, జనసేన మధ్య సీట్ల పొత్తులో భాగంగా సప్తగిరి పేరు తెరపైకి వచ్చింది. చిత్తూరు స్థానం నుంచి సప్తగరి పేరును పరిశీలిస్తుండటం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Saptagiri-TDP

ఇలా ఉండగా, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దృష్టిలో సప్తగిరి పేరు ఉంది. ఆయన‌కు సీటు కేటాయించే విషయంపై అధినాయకుల ఆశీస్సులు కూడా ఉన్నాయనే విషయం మీడియాలో వైరల్ అవుతున్నది. ఎలాంటి అండ లేకుండానే సినీ పరిశ్రమలో మంచి స్థానాన్ని సంపాదించుకొన్న సప్తగిరి రాజకీయాల్లోకి వచ్చి తన సేవా దృక్పథంతో ప్రజల హృదయాల్లో గుర్తుండిపోతారు అనే మాట తన అభిమానుల్లో, శ్రేయోభిలాషులు, సన్నిహితుల వినిపిసున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X