విడాకుల దారిలో టాప్ కమెడియన్?.. సోషల్ మీడియాలో పోస్ట్‌ సంచలనం!

ఏమైందో తెలియదు గానీ ఈ మధ్య విడాకులు తీసుకునే సెలబ్రెటీలు పెరుగుతున్నారు. మధ్యలో ఇది కాస్త తగ్గినా, మళ్లీ జోరందుకుంది. స్మాల్ స్క్రీన్, బిగ్‌స్క్రీన్, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా డివోర్స్ తీసుకోవడం వెంటనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం ఆనవాయితీగా మారిపోయింది. బాలీవుడ్‌లో ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్‌లు విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారని.. లేదు లేదు ఆల్రెడీ విడాకులు తీసేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. క్రికెట్ కపుల్ హార్డిక్ పాండ్యా- నటాషాలు విడిపోయారు. ఈ లిస్టులో మరికొందరు ప్రముఖులు ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఎవరు, ఎప్పుడు ఏ న్యూస్ చెబుతారో.. ఎలాంటి పోస్ట్ పెడతారోనని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.

షార్ట్ ఫిల్మ్స్, కామెడీ కంటెంట్ ఉన్న వీడియోలతో పాపులర్ అయ్యారు వైవా హర్ష. విశాఖపట్నానికి చెందిన ఇతని పూర్తి హర్ష చెముడు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో .. కాలేజీలో వైవా జరుగుతున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై తీసిన వైవా అనే వీడియోకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఇందులో పేరు రావడంతో హర్ష చెముడు కాస్తా వైవా హర్షగా మారిపోయాడు. ఈ పాపులారిటీతో వైవా హర్షకు సినిమాల్లో అవకాశాలు రాగా.. కమెడియన్‌గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్‌లో సత్తా చాటి బిజీ అయ్యాడు.

Is comedian viva harsha heading for divorce with Akshara Reesu Actor cryptic message goes viral

కమెడియన్లు ఏనాటికైనా హీరోగా మారుతారన్న ఆనవాయితీ ఉన్న టాలీవుడ్‌లో వైవా హర్షకు కూడా ఆ అదృష్టం దక్కింది. సుందరం మాస్టర్‌ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు హర్ష. మాస్ మహారాజా రవితేజ నిర్మించిన ఈ మూవీ యావరేజ్‌గా నిలిచినా హర్ష నటనకు ప్రశంసలు దక్కాయి. కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న హర్ష జీవితంలో ఇక సెటిలైపోవాలని ఫిక్సయి .. తన స్నేహితురాలు అక్షరతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వైవా హర్ష తన వ్యక్తిగత వివరాలు, సినిమాల సంగతులను పంచుకుంటూ ఉంటారు. అయితే లేటెస్ట్‌గా ఆయన పెట్టిన ఓ పోస్ట్ కలకలం రేపుతోంది.

లైఫ్ అనేది రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎగ్జయిట్‌మెంట్, ఇరిటేషన్, భయం, థ్రిల్ లాంటివి ఉంటాయి. అయినప్పటికీ ఏది మన చేతిలో ఉండవు.. మనల్ని అడ్డుకుంటాయి, తర్వాత అవే తప్పుకుంటాయి. కానీ అప్పటి వరకు మనం బకెల్ గట్టిగా పట్టుకుని రైడ్ ఎంజాయ్ చేయాల్సిందే. లైఫ్‌లో దేని మీదా హోప్ పెట్టుకోకూడదు, తర్వాత బాధపడకూడదు, జీవితం ఎటు తీసుకెళితే అటు వెళ్లడమే అంటూ హర్ష రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్లు వైవా హర్షకి ఏమైంది.. పర్సనల్ లైఫ్‌లో డిస్టర్బ్ అయ్యాడా, భార్యతో విడిపోయాడా అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Is comedian viva harsha heading for divorce with Akshara Reesu Actor cryptic message goes viral

ఈ ఊహాగానాలకు తెరదించుతూ హర్ష మరో పోస్ట్ పెట్టారు. నా యోగక్షేమాలను గూర్చి ఆరా తీసేవారు ఇంత మంది ఉన్నారా.. నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నాను.. వర్క్ విషయంలోనే చిరాకుగా ఉంది. కొందరు పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు.. దానికే ఇబ్బంది పడుతున్నానని హర్ష చెప్పాడు.

ఇలాంటివి ప్రతి చోటా తప్పవు.. వైఫల్యాల కంటే విజయాలు చాలా గొప్పవి.. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని ఎవరైనా మిమ్మల్ని అనే పరిస్ధితికి రావొద్దని హర్ష సూచించాడు. జీవితంలో ఎన్ని దెబ్బలు తగిలినా మరింత బలంగా తిరిగొస్తానని ఆయన పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే తాజా పోస్టుతో నెటిజన్లందరూ హర్ష చెముడు విడాకులు తీసుకోబోతున్నాడనే ఊహాగానాలు చేస్తున్నారు. హర్ష చెముడు తనకు స్నేహితురాలైన ఆకాష్ రీసును ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. 2021లో ఎంగేజ్‌మెంట్ జరిగింది. అక్టోబర్ 2022లో వివాహం చేసుకొన్నారు. తాజాగా నర్మగర్భంగా చేసిన ఇన్స్‌టాగ్రామ్ పోస్టుతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

More from Filmibeat

Read more about: viva harsha akshara tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X