Dhurandhar 3: ధురంధర్ 3 మూవీపై లీకులు.. ఆదిత్య ధార్ ఇచ్చిన హింట్ ఏమిటంటే?
ధురంధర్ ది రివెంజ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. ఈ సినిమాను భారతీయ ప్రేక్షకుల్లో అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారు. విడుదలైన ప్రతీ కేంద్రంలోను ఈ సినిమా రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తున్నది. ఈ సినిమా భారతీయ సినిమా కలెక్షన్ల చరిత్రను తిరగరాసేందుకు రెడీ అవుతున్నది. అయితే ఈ సినిమా థియేటర్‌లో సంచలనాలు నమోదు చేస్తుండగానే.. ఈ సినిమాకు సంబంధించిన మూడో పార్ట్ అంటే ధురంధర్ 3 వస్తుందనే ఊహాగానాలు, వార్తలు జోరందుకొన్నాయి. నిజంగానే ధురంధర్ 3 (Dhurandhar 3) సినిమా ప్లానింగ్ జరుగుతున్నదా? ఆదిత్య ధార్ ఈ సినిమాను ఏ రకంగా ప్లాన్ చేస్తున్నాడనే వివరాల్లోకి వెళితే..
ధురంధర్ 2 సినిమా విషయానికి వస్తే.. ధురంధర్ మూవీ పెంచిన అంచనాలకు మించి స్పందన రాబట్టుకొంటున్నది. మార్చి 19వ తేదీన రిలీజైన ఈ సినిమా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

ఇలాంటి సంచనాలు ధురంధర్ 2 నమోదు చేస్తుంటే.. ఈ సినిమా మూడో పార్ట్ ధురంధర్ 3 సినిమా వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ధురంధర్ 2 రాకముందే ధురంధర్ 3 మూవీ వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. జూన్ 2026 సంవత్సరంలోనే ఈ సినిమా రిలీజ్ అవుతుందనే రూమర్లు వచ్చాయి. అయితే వాటిపై కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా స్పందించి వివరణ ఇచ్చారు.
ధురంధర్ 1, ధురంధర్ 2 సినిమాలు కొత్త అనుభూతిని పంచడంతో ప్రేక్షకుల్లో ఇలాంటి కోరికలు మొదలయ్యాయి.ఈ సినిమాకు సీక్వెల్ ఉంటే బాగుంటుందనే అభిలాషను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా మూడో పార్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ధురంధర్ ది రివేంజ్ సినిమా సక్సెస్‌ను మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. ధురంధర్ 3 గురించి చిత్ర యూనిట్ గానీ, ఆదిత్య ధార్ గానీ తొందరపడటం లేదు అని ముఖేష్ చాబ్రా తెలిపారు.
అయితే ధురంధర్ 3 గురించి దర్శకుడు ఆదిత్య ధార్ చూఛాయగా హింట్ ఇచ్చాడు. ఈ సినిమా మూడో పార్ట్ గురించి కొన్ని చర్చలు జరిగాయి. అయితే కచ్చితంగా ఓ నిర్ణయానికి రాలేదు. సీక్వెల్ కోసం తొందరపాటు లేదు. ప్రేక్షకుల అభిరుచిని, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పక్కాగా కథ, కథనాలను రూపొందిస్తాం. దానికి కొంత సమయం కావాల్సి ఉంది అని అన్నారు.
ధురంధర్ 2 సినిమా గత 5 రోజుల్లో ఈ సినిమా వసూళ్ల వివరాల్లో వెళితే.. ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఇండియాలో 620 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 520 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 250 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 870 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. మంగళవారంతో 900 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది అని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications

















