Game Changer: గేమ్ ఛేంజర్ సినిమాతో దిల్ రాజుకి అసలు నష్టాలే రాలేదా? అదెలా అంటే?
ఈ ఏడాదికి మొదటి బిగ్ రిలీజ్ గా వచ్చిన సినిమానే "గేమ్ ఛేంజర్". సంక్రాంతి బరిలో ఏదో అవుతుంది అనుకుంటే ఈ సినిమా ఇంకేదో అయ్యింది అని చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాని ఇండియన్ టాప్ దర్శకుల్లో ఒకరైన దర్శకుడు శంకర్ మొదటి సారి తన కథ కాకుండా మరో దర్శకుని కథతో తన స్టైల్ లో తెరకెక్కించారు.
నిజానికి రియల్ స్టోరీనే మేకర్స్ తీసుకోగా ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. కాగా ఈ సినిమాకి నిజంగా కంటెంట్ అంత దారుణంగా ఉందా అంటే అది కూడా కాదు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి కూడా చేయని దారుణ నెగిటివిటీ ఈ సినిమా చూడాల్సి వచ్చింది. ఇంకా టీంలో కూడా అంతర్గతంగా కూడా పలు లోపాలు ఉన్నాయని సినిమా రిలీజ్ అయ్యాక పలు షాకింగ్ అంశాలు బయటకి వచ్చాయి.

ఇక దీనితో ఎన్నో వందల కోట్లు బడ్జెట్ తో తీసిన గేమ్ ఛేంజర్ దారుణ వైఫల్యం నిర్మాత దిల్ రాజుకి ఘోరమైన నష్టాలు తీసుకొచ్చింది అంటూ ఒక టాక్ అయితే ఉంది. మరి నిజంగానే దిల్ రాజుకి కోలుకోలేని నష్టాలు గేమ్ ఛేంజర్ తో వచ్చాయా అంటే లేదనే వినిపిస్తుంది. కాగా గేమ్ ఛేంజర్ సినిమా అంత దారుణమైన టాక్ లో కూడా సగానికి పైగా పెట్టుకున్న టార్గెట్ ని దాటేసింది.
ఇలా సుమారు జరిగిన థియేట్రికల్ బిజినెస్ లో 70 శాతం అందుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. సో ఆ 30 శాతం అయినా కూడా నష్టమే కదా అంటే.. ఇపుడు లేదనే కొత్త వెర్షన్ వినిపిస్తుంది. ఇదెలా అంటే దిల్ రాజు నిర్మాణంలోనే గేమ్ ఛేంజర్ తర్వాత మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా సంక్రాంతికి వచ్చింది.

మరి ఈ సినిమాని గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ తో దిల్ రాజు ఏపీ, తెలంగాణాలో అతి తక్కువ ధరలకి ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి రికార్డు వసూళ్లు అలాగే భారీ ఎత్తున లాభాలు అందించింది. సో ఇలా దిల్ రాజు ఎలాంటి నష్టాలు లేకుండా ఈ సంక్రాంతికి సేఫ్ అయ్యిపోయారట. మరి ఈ సినిమాలు రెండు వేరే వేరే సమయాల్లోకి కానీ వచ్చి ఉంటే వేరేలా ఉండేదేమో మరి.
అందుకే ఇటీవల తనపై ఐటీ దాడులు జరిగినప్పటికీ దిల్ రాజు కామ్ గానే ఉండి అవి అయ్యాక వెకేషన్ కి కూడా వెళ్లారట. కాగా గేమ్ ఛేంజర్ రన్ దాదాపు పూర్తి కావచ్చింది కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం ఇంకా అదరగొడుతుంది. ఆల్రెడీ మన సీనియర్ హీరోస్ లో ఆల్ టైం హైయెస్ట్ వసూళ్లు అందుకోగా 300 కోట్ల క్లబ్ లో చేసే దిశగా వెళుతున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సెన్సేషనల్ మార్క్ ని కూడా అందుకుంటే మన సీనియర్ హీరోస్ లోనే కాకుండా యంగ్ స్టార్ హీరోస్ లో కూడా ఇదొక బిగ్గెస్ట్ రికార్డు అవుతుంది అని చెప్పవచ్చు


Click it and Unblock the Notifications











