బాలీవుడ్ లో సందీప్ రెడ్డిపై వివక్ష.? కబీర్ సింగ్ తో అలా... యానిమల్ తో ఇలా!

డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి సునామీలా వచ్చిన సంగతి తెలిసిందే. 'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో సంచలనంగా మారారాయన. అంతే కాదు.... ఆయన తొలి చిత్రమే హిందీ, తమిళంలో రీమేక్ కూడా కావడం గొప్ప విషయం. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ బిగ్ ప్రాజెక్ట్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. దేశంలోనే బిగ్గేస్ట్ డైరెక్టర్ల జాబితాలో ఈయన కూడా స్థానం సంపాదించుకున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ గా ఎప్పికప్పుడు తన మార్క్ చూపిస్తూనే వస్తున్నాడు.

సందీప్ రెడ్డి వంగా తన సినిమాలతో ఎంత సెన్సేషన్ గా మారుతుంటారో... ఆయన ఇంటర్వ్యూలతోనూ అంత సంచలనంగా మారుతుంటారు. సందీప్ రెడ్డి వంగ చూడటానికి కాస్తా భయం పుట్టించేలా ఉన్నా.. ఆయన ఎంతో జోవియల్ గా ఉంటారు. ఇదే విషయాన్ని రీసెంట్ గా 'తండేల్' సక్సెస్ మీట్ లో రాక్ స్టార్ డీఎస్పీ కూడా తెలిపిన విషయం తెలిసిందే. వర్క్, సినిమా విషయాలు తప్ప మరో మాట మాట్లాడరు సందీప్ రెడ్డి వంగ. పని పట్ల ఎంతో సిన్సీయారిటీగా ఉంటారు.

Is Discrimination against Sandeep Reddy Vanga in Bollywood Spirit Director Explained this

అయితే.. తెలుగులో 'అర్జున్ రెడ్డి' సెన్సేషనల్ హిట్ అయిన తర్వాత పలు ప్రాజెక్ట్స్ ను లైన్ పెట్టారు సందీప్ రెడ్డి వంగ. కానీ కొన్ని కారణాల వల్ల అవి సెట్ కాకపోవడంతో హిందీ నుంచి రీమేక్ చేద్దామని ఒత్తిడి రావడంతో ఒప్పుకున్నాడు. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ - కియారా అద్వానీ జంటగా 'కబీర్ సింగ్'ను తెరకెక్కించారు. రీమేక్ అయినప్పటికీ ప్రతి ఫ్రేమ్ ప్రెష్ గా కనిపించేలా తీశారు సందీప్ రెడ్డి వంగ. పైగా మ్యూజిక్ కూడా పెద్ద సక్సెస్ ను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా రూ.350 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.

ఆ వెంటనే మళ్లీ బాలీవుడ్ లోనే రన్బీర్ కపూర్ తో 'యానిమల్' చిత్రాన్ని సెట్ చేశారు. టీసిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రూ.900 కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టింది. ఇలా టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా సందీప్ రెడ్డి వంగ తనదైన శైలిలో దూసుకెళ్తుండటం విశేషం. అయితే.. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగపై వివక్ష కూడా కొనసాగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సందీప్ రెడ్డి కూడా పలు కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

'కబీర్ సింగ్' రీమేక్ ఫుల్ సక్సెస్ అయిన తర్వాత.. ఆ చిత్రంలో నటించిన ఒక యాక్టర్ ను బాలీవుడ్ లోని ఓ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ అవమానించిందంట.... నువ్వు కబీర్ సింగ్ లో నటించావు కాబట్టి నీకు ఇక్కడ అవకాశం ఇవ్వడం లేదని మొహం మీదనే చెప్పడం సందీప్ కు తెలిసిందంట. చాలా బాధపడ్డారంట. అయితే ఆ నటుడు ఎవరు? ఆ ప్రొడక్షన్ కంపెనీ ఏంటనేది బయటపెట్టలేదు. అలాగే 'యానిమల్' తర్వాత కూడా అలాంటి ఘటనే రిపీట్ అయ్యిందంట. యానిమల్ మూవీ బాగలేదని విమర్శిస్తూనే.. సందీప్ నటన బాగుందని ప్రశంసలు కురిపించారంట.

అక్కడ వాళ్లకు నచ్చనది యానిమల్ కాదు... డైరెక్టర్ అని సందీప్ రెడ్డి వంగ అని రీసెంట్ గా వెల్లడించారు. అయితే రన్బీర్ తో కలిసి పనిచేసేందుకే బాలీవుడ్ లోని కొందరు అలాంటి కామెంట్లు చేశారన్నారు. కానీ అలాంటి వ్యాఖ్యలతో పనులు కావాలని చెప్పుకొచ్చారు. సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రీప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత రణబీర్ తో 'యానిమల్ పార్క్' ఉండనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X