పొలిటికల్ టైగర్ మనవడితో దిశాపటానీ.. మీడియాకు చిక్కి..
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ అఫైర్ల వార్తలకు మీడియాలో కొదువేమీ ఉండదు. ప్రముఖ హీరోలు, సెలబ్రిటీలతో డేటింగ్ అంటూ ఎప్పుడూ ఆమె వార్తల్లో కనిపిస్తుంటారు. ఇప్పటి వరకు టైగర్ ష్రాఫ్‌తో రిలేషన్ కొనసాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దిశా పటానీ అఫైర్ గురించి మరో వార్త ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో షికారు చేస్తున్నది. అయితే ఈ ముద్దు గుమ్మ అఫైర్ కొనసాగిస్తున్నది బాలీవుడ్ హీరోతోనని అనుకొంటే పప్పులో కాలేసినట్టే. ఏకంగా ఈ బ్యూటీ మహారాష్ట్రను గడగడలాడించిన బాల్ థ్రాక్రే మనవుడితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల కాలంలో బాల్ థాక్రే మనవడు ఆదిత్య థాక్రేతో డిన్నర్ డేట్లు హడల్ ఎత్తిస్తున్నది, చాటుమాటుగా కలుసుకోవడం మీడియా కెమెరాకు చిక్కడంతో పలు రకాలుగా గుసగుసలు వినిపించాయి.
ఈ వ్యవహారంపై దిశా పటాని బాలీవుడ్ మీడియాకు వివరణ ఇస్తూ.. ఆదిత్య థాక్రే నాకు ఫ్రెండ్ మాత్రమే.. అంతేకానీ మా మధ్య ఇంకేమి లేదు అని చెప్పింది.

అంతేకాకుండా.. నాపై ఈ రకమైన గాసిప్స్ రావడం కొత్తేమీ కాదు. ఇలాంటి వాటిని పట్టించుకోను అని చెప్పింది. ఇలాంటి రూమర్లను పట్టించుకొంటే ముందుకెళ్లలేమని స్పష్టం చేసింది.
తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భారత్ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టింది. గతంలో వరుణ్ తేజ్‌తో పూరీ జగన్నాథ్ రూపొందించిన లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.


Click it and Unblock the Notifications











