రాజ్ తరుణ్ పబ్లిక్ స్టంటా? సినిమా ప్రమోషన్ కోసం ప్రేయసితో కాంట్రెవర్సా?

తెలుగు సినిమా దగ్గర వచ్చిన కొన్ని సినిమాలు హీరోగా వచ్చిన మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడం అది కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా తక్కువగానే జరుగుతుంది. మరి అలాంటి అతి తక్కువ మంది యంగ్ హీరోస్ లో యువ నటుడు రాజ్ తరుణ్ కూడా ఒకడు. కాగా తాను ఇండస్ట్రీ లోకి వచ్చి పదేళ్లు అలా అయ్యింది.

అయితే కెరీర్ స్టార్టింగ్ లోనే యూత్ఆకట్టుకునే సినిమాలు చేసి వరుస హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఇపుడు తన పరిస్థితి ఏమంత బాగాలేదని చెప్పాలి. సరైన సినిమాలు లేవు చేసిన కొన్ని కూడా పెద్దగా రాణించడం లేదు. దీనితో ఫేడ్ అవుట్ అవుతున్నాడు అనే సమయంలో ఓ షాకింగ్ కాంట్రవర్సీతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు.

Is hero raj tarun using girl friend lavanya controversy for tiragabadara saamy netizens suspecting

కాగా ఈ యంగ్ హీరో తన గర్ల్ ఫ్రెండ్ ఒకమ్మాయిని మోసం చేసాడు అని అలాగే తనని గుడిలో పెళ్లి చేసుకొని ఇప్పుడు మరో హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడని ఆమె కంప్లైంట్ ఇవ్వడం ఒకెత్తు అయితే తర్వాత దానికి తాను వివరణ ఇస్తూ ఆ అమ్మాయే నన్ను టార్చర్ చేసేది అంటూ తన వెర్షన్ తో వచ్చాడు. కాగా ఈ ఇద్దరి వెర్షన్ లు పక్కన పెడితే అసలు వీటిని అన్నిటిని గమనిస్తున్న నెటిజన్స్ వెర్షన్ మాత్రం ఇంకోలా ఉందని చెప్పాలి.

ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల ప్రమోషన్స్ అంతా ఈ ఫార్మాట్ లోనే నడుస్తున్నాయి. దీనితో ఈ డ్రామా అంతా కూడా తనది ఏదో కొత్త సినిమా కోసమే చేస్తున్నాడు అని నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. మరి వారి వెర్షన్ నిజం అయ్యినప్పుడు వీరి వెర్షన్ కూడా పాజిబుల్ కాదా అనడానికి లేదు. అయితే పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా అంటే..

Is hero raj tarun using girl friend lavanya controversy for tiragabadara saamy netizens suspecting

ఈ మధ్యనే యువ హీరోయిన్ నివేతా పెత్తురాజ్ ఓ పోలీసుతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. కానీ సీన్ కట్ చేస్తే ఇదంతా కేవలం ఒత్తి డ్రామా అని తన "పరువు" వెబ్ సిరీస్ కోసం చేసిన సెటప్ అని తేలింది దీనితో ఇలాంటి కాంట్రవర్సీలు వస్తే మాత్రం నెటిజన్స్ ఇప్పుడు అంత తొందరగా నమ్మడం లేదు.

ఆ రేంజ్ లో నిజానికి అబద్దానికి వ్యత్యాసాన్ని సినీ వాళ్ళు వారి ప్రమోషన్స్ కోసం మార్చేశారు. సపోజ్ రాజ్ తరుణ్ మేటర్ లో నిజం ఉన్నా కూడా ఇప్పుడు దాదాపు అంతా ఇది సినిమా ప్రమోషన్స్ కోసమే అనుకుంటున్నారు తప్పితే తన పరిస్థితిపై అయ్యో పాపం అనేవారు బాగా కరువయ్యారు. మరి ఇంతకీ ఈ కాంట్రవర్సీ నిజమా లేక అబద్దమా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. నిజం అయితే ఓకే కానీ అబద్దం అయితే ఉన్న ఇంప్రెషన్ ని కూడా పోగొట్టుకునేవాడు అవుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X