నాపైనే కాదు.. పెళ్లి చేసుకోమని మరో వ్యక్తిపై కేసు.. లావణ్య బ్లాక్ మెయిల్ అంటూ రాజ్ తరుణ్

తెలుగు సినిమా హీరో రాజ్ తరుణ్‌పై క్రిమినల్ కేసు నమోదు కావడం టాలీవుడ్‌లో సంచలనం రేపింది. తనను ప్రేమించి మోసం చేశాడనే ఆరోపణలతో ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం మరింత చర్చనీయాంశమైంది. అయితే ఆయన ప్రియురాలు లావ్యణ చేసిన ఆరోపణలపై రాజ్ తరుణ్ ఘాటుగా స్పందించిన తీరు ఎలా ఉందంటే?

రాజ్ తరుణ్ లవర్‌గా చెప్పుకొనే డ్యాన్స్ టీచర్ లావణ్య అత్యంత వివాదాస్పదంగా మీడియాలో కనిపిస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడి 45 రోజులపాటు ఆమె జైలు జీవితం గడిపారు. అయితే ఆ కేసు ఇంకా తేలకముందే తాజాగా ఆమె ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేసి మరోసారి మీడియా హెడ్‌లైన్లను ఆకర్షించారు.

Is Hero Raj Tharun blackmailed by his lover Lavanya before case filing in Narsingi police Station

నార్సింగి పోలీసులు చేసిన ఫిర్యాదులో.. రాజ్ తరుణ్‌తో 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. మేము గుడిలో కూడా పెళ్లి చేసుకొన్నాం. ఆయన మరో హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకొన్నాడు. ఆ తర్వాత వదిలేశాడు. నాకు దూరంగా ఉంటున్నాడు అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే కేసు నమోదు అయిన తర్వాత రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ..
లావణ్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత ఆమెతో రిలేషన్ కట్ అయింది. గుంటూరులో మస్తాన్ అనే అతడు పెళ్లి చేసుకోవడం లేదు అని బ్లాక్ మెయిల్ కేసు ఉంది. డ్రగ్స్ తీసుకోవద్దని చాలా సార్లు చెప్పాను అని అన్నారు.

Is Hero Raj Tharun blackmailed by his lover Lavanya before case filing in Narsingi police Station

డ్రగ్స్ తీసుకొంటే విషయం పోలీసులకు చెప్పాలని అనుకొన్నాను. నా రెప్యుటేషన్ దెబ్బ తింటుందని నేను చెప్పలేకపోయాను. నన్ను చాలా సార్లు బెదిరించింది. నాకు ఆమె ఫోన్ చేయడం లేదు. నా చుట్టు పక్కల ఉన్న వాళ్లకు చేస్తున్నది. నన్ను ఈ విషయంలో ఏ మాత్రం అనుమానించవద్దు. కొంచెం సమయం ఇస్తే అన్ని క్లియర్ అవుతాయి అని రాజ్ తరుణ్ అన్నారు.

అయితే ఇద్దరి వెర్షన్లు కరెక్ట్‌గానే ఉన్నాయి. ఎవరి డిఫెన్స్ వారు చేసుకొన్నట్టు కనిపిస్తున్నది. అయితే ఇద్దరిలో ఎవరి తప్పు? నిజంగా వారి మధ్య రిలేషన్ బ్రేక్ అయిందా? గుంటూరు, డ్రగ్స్ కేసుల్లో లావణ్య పరిస్థితి ఏమిటనే విషయం మరింత ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X