Hit 3లో ఆ సీరియల్ సీన్లు .. రెడ్ హ్యాండెడ్‌గా లేడీస్‌కి దొరికిన నాని, శైలేష్‌ని దారుణంగా
తెలుగునాట పాపులర్ అయిన హిట్ ఫ్రాంఛైజీలో మూడో కేసుగా డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హిట్ 3 . నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని హిట్ 3ని నిర్మించారు. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం.. నాని కెరీర్‌లో రెండోసారి 100 కోట్లు కొట్టిన సినిమాగా నిలిచింది.

ఐదేళ్ల పాటు 300 నేరాలపై అధ్యయనం
ప్రపంచవ్యాప్తంగా జరిగిన దాదాపు 300కు పైగా నేరాలను ఐదేళ్ల పాటు అధ్యయనం చేసిన తర్వాతే శైలేష్ కొలను హిట్ ఫ్రాంఛైజీకి శ్రీకారం చుట్టారు. విశ్వక్‌సేన్‌తో హిట్ కేస్ 1, అడివి శేష్‌తో హిట్ కేస్ 2 తీసిన ఆయన నానితో హిట్ కేస్ 3 తెరకెక్కించారు. నాని నటనకు , శ్రీనిధి అందాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. హిట్ 3ని మరింత ప్రమోట్ చేసేందుకు గాను నాని తెగ కష్టపడుతున్నాడు. అమెరికాలో సినిమాకు ప్రచారం చేస్తోన్న ఆయన తన కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు.
హిట్ 3 సీన్లపై ట్రోలింగ్
అర్జున్ సర్కార్‌గా తనలోని కొత్త కోణాన్ని నాని చూపించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక శ్రీనిధితో రొమాంటిక్ సీన్స్‌లోనూ రెచ్చిపోయారని ప్రేక్షకులు అంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ హిట్ 3లోని కొన్ని సీన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు వీటిని ఎక్కడో చూసినట్లుగా ఉందంటూ ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. ఈ క్రమంలో శైలేష్ కొలను- నానిలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
కథలు దొరకడం కష్టమైన వేళ
ఓ సినిమాకు, మరో సినిమాకు కథ, కథనం, సీన్స్‌లో పోలిక ఉంటుంది. వందల్లో తయారవుతున్న సినిమాలకు కొత్తగా కథలు దొరకాలొంటే కష్టమే. అందుకే కొన్ని సినిమాలలోంచి మంచి పాయింట్‌ను తీసుకుని కథలు, సీన్లు అల్లుతారు రచయితలు. అయితే ఆశ్చర్యకరంగా ఓ సీరియల్ నుంచి సినిమా కోసం కొన్ని సీన్లను కాపీ చేస్తే. హిట్ విషయంలో అదే జరిగిందంటున్నారు నెటిజన్లు. ఓ తెలుగు సీరియల్‌లోని రొమాంటిక్, లవ్ ట్రాక్‌లను హిట్ 3 కోసం కాపీ కొట్టారంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఆ సీరియల్‌లో ఏవైతే సీన్లను కాపీ చేశారని అంటున్నారో? ఈ సీన్లను కట్ చేసి ట్రోల్ చేస్తున్నారు.
గుప్పెడంత మనసు సీన్స్‌ను లేపేసిన శైలేష్?
ఇంతకీ హిట్ 3 కోసం ఏ సీరియల్‌లో నుంచి సీన్లను కాపీ చేశారో తెలుసా? తెలుగు పాపులర్ సీరియల్ గుప్పెడంత మనసు. స్టార్ మాలో రెండేళ్ల క్రితం నెంబర్‌వన్ సీరియల్‌గా వెలిగిన ఈ ధారావాహికలో రిషి, జగతి, వసు, మహేంద్ర క్యారెక్టర్లు ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సీరియల్‌లోని సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ సీరియల్‌లోని సీన్లనే దర్శకుడు శైలేష్ కొలను, హీరో నానిలు లేపేశారని మహిళా ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు.
ఎవర్‌గ్రీన్ రిషి - వసుధార
గుప్పెడంత మనసులో రిషి - వసుధార మధ్య జరిగిన లవ్ ట్రాక్‌ను హిట్ 3లో నాని - శ్రీనిధిల కోసం కాపీ చేసినట్లు రెండు సీన్లను పక్కపక్కన పెట్టి మరి ట్రోల్ చేస్తున్నారు. హీరో తల్లికి దూరంగా పెరగడం, కారుకి సీటు బెల్ట్ పెట్టే సీన్, హీరోకి హీరోయిన్ పానిపూరి తినడం నేర్పించే సీన్ ఇవన్నీ గుప్పెడంత మనసులోంచి లేపేసినవేనని మండిపడుతున్నారు. సీన్లే కాదు.. హీరో హీరోయిన్ల ఎక్స్‌ప్రెషన్స్ కూడా కాపీ చేశారని ఫైర్ అవుతున్నారు. అయినప్పటికీ రిషి- వసుధారలతో నాని- శ్రీనిధి శెట్టిలు మ్యాచ్ చేయలేకపోయారని గుప్పెడంత మనసు ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ వివాదంపై హీరో నాని, దర్శకుడు శైలేష్ కొలను ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











