RC16 సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత.. కానీ షరతులు వర్తిస్తాయి!

ఆర్ఆర్ఆర్ సినిమా, నాటు నాటు పాటతో గ్లోబల్ స్టార్ గా మారాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ పాటకు ఆస్కార్ రావడంతో చెర్రీకి మరింతగా క్రేజ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చరణ్ నెక్స్ట్ ప్రాజెక్టులపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకునే స్థాయిలోనే సినిమాలు చేస్తున్నారు చెర్రీ. అయితే ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న ఈయన.. ఇది విడుదల కూడా కాకముందే నెక్స్ట్ సినిమాను లాక్ చేశారు.

ముఖ్యంగా తొలి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు తన తదుపరి చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేశాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబుతో RC16 తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న RC16 మూవీ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకున్నారని కన్ఫార్మ్ కూడా అయిందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు అన్నిటిపై ఓ క్లారిటీ వచ్చేసింది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Is it Correct or Not Samantha is The Heroine of Ram Charan Next Film RC17 Check Details

గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చేయబోయే RC16ను లెజెండరీ రెజ్లర్ కోడి రామ్మూర్తి నాయుడి బయోపిక్ గా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. శ్రీకాకుళంలో పుట్టిన ఈయన ఆ తర్వాత విజయనగరంలో పెరిగారు. 20వ శతాబ్దపు తొలి నాళ్లలో ఈయన గొప్ప రెజ్లర్ గా పేరు పొందాడు. ఒంటి చేత్తో రైల్ ఇంజిన్‌ను ఆపారని, ఏనుగును మోసుకెళ్లగల బలశాలి అనే పేరు ఉంది. కోడి రామ్మూర్తి నాయుడు మద్రాసులోని వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని తిరిగి విజయనగరానికి వచ్చి అక్కడ వ్యాయామ శిక్షకుడిగా పని చేశారు.

Is it Correct or Not Samantha is The Heroine of Ram Charan Next Film RC17 Check Details

ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంతను కథానాయికగా తీసుకున్నారని చాలా పేపర్లలో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవం అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్, సమంతల మధ్య ఇప్పటికే ఫొటోషూట్ జరిగినప్పటికీ ఇంకా ఆమెను కన్ఫార్మ్ చేయలేదని తెలుస్తోంది. కేవలం సమంతతోనే కాకుండా మరికొంత మంది బ్యూటీలతో కూడా పొటోషూట్ చేశారట. కానీ ఇప్పటికీ ఎవరినీ ఫిక్స్ చేయలేదట. మరి చెర్రీ సరసన నటించే ఛాన్స్ ను ఎవరు కొట్టేస్తారో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X