Sridevi శ్రీదేవీతో పెళ్లికి ముందే జాన్వీ కపూర్ పుట్టిందా? బోనికపూర్ అదిరిపోయే క్లారిటీ!

బాలీవుడ్ నిర్మాత బోని కపూర్‌తో శ్రీదేవి రిలేషన్‌షిప్, వారి పెళ్లిపై అనేక రూమర్లు ఉన్నాయి. అలాగే శ్రీదేవీ మరణంపై అభిమానుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. అయితే శ్రీదేవీ మరణించి ఐదేళ్లు అయినప్పటికీ. . దిగ్గజ నటి మరణంపై అనుమానాలు వెంటాడుతున్నాయి. అలాంటి అనుమానాలు, సందేహాలకు బోని కపూర్ చెక్ పెట్టారు. అంతేకాకుండా జాన్వీ కపూర్ పుట్టుక గురించి ఉన్న సందేహాలకు కూడా బోని కపూర్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. జాన్వీ కపూర్ జననంపై బోని కపూర్ క్లారిటీ ఇస్తూ..

షిర్డిలో శ్రీదేవీతో వివాహం:శ్రీదేవీతో నా వివాహం 1996లో జూన్ 2వ తేదీన జరిగింది. మేమిద్దరం షిర్డిలో వివాహం చేసుకొన్నాం. నాకు శ్రీదేవీతో రెండో వివాహం. నాతో ఆమెకు మొదటి పెళ్లి. షిర్డిలో దండలు మార్చుకొన్న తర్వాత మేము అక్కడే ఓ రాత్రి గడిపాం. ఆ తర్వాత ఏడాదికి మా పెళ్లి గురించి పబ్లిక్‌గా ప్రకటించాం. అప్పటి వరకు మా పెళ్లి గురించి చెప్పాల్సిన అవసరం రాలేదు అని బోని కపూర్ చెప్పారు.

Is Janhvi Kapoor born to Sridevis before Marriage? Here is Boney Kapoor confirmation

శ్రీదేవీ ప్రెగ్నెన్సీ గురించి:పెళ్లి తర్వాత జనవరి 1997 సంవత్సరంలో శ్రీదేవీ గర్బం దాల్చింది.ఆమె ప్రెగ్నెంట్ కావడంతో తప్పనిసరిగా మా పెళ్లి గురించి అందరికి చెప్పాల్సి వచ్చింది. ఆ సమయంలోనే మీడియాకు మేము అధికారికంగా పెళ్లి గురించి ప్రకటించాం. అయితే 1996లో కాకుండా 1997లో పెళ్లి చేసుకొన్నామని చెప్పాం. దాంతో అనేక రూమర్లు క్రియేట్ అయ్యాయి అని బోని కపూర్ చెప్పారు.

Is Janhvi Kapoor born to Sridevis before Marriage? Here is Boney Kapoor confirmation

జాన్వీ కపూర్ ఎప్పుడు పుట్టిందంటే? :అయితే మేము 1997లో పెళ్లి చేసుకొన్నామని చెప్పడంతో పెళ్లికి ముందే జాన్వీ కపూర్ పుట్టారని ఓ వర్గం మీడియా కథనాలు రాయడం మొదలుపెట్టింది. అయితే జాన్వీ కపూర్ మాత్రం మార్చి 6వ తేదీ, 1997 సంవత్సరంలో పుట్టింది. ఆ విషయాన్ని మీడియా పట్టించుకోవడం లేదు. కానీ జాన్వీ కపూర్ పుట్టుక గురించి ఇప్పటికి మీడియా అవాస్తవాలను రాయడం జరుగుతున్నదని బోని కపూర్ చెప్పారు.

Is Janhvi Kapoor born to Sridevis before Marriage? Here is Boney Kapoor confirmation

బోనికపూర్ సంతానం గురించి:శ్రీదేవీతో పెళ్లి తర్వాత బోని కపూర్‌కు ఇద్దరు సంతానం కలిగారు. పెద్ద కూతురు జాన్వీ కపూర్, రెండో కూతురు కుషి కపూర్. ఇక బోని కపూర్‌కు మొదటి భార్య సునీత ద్వారా ఇద్దరు సంతానం ఉన్నారు. ఒకరు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కాగా, మరోకరు అన్షులా కపూర్ అవ్వడం తెలిసిందే. శ్రీదేవి మరణ వరకు రెండు కుటుంబాలు అంటీ ముట్టనట్టు ఉండేవి. శ్రీదేవీ మరణించిన తర్వాత అర్జున్ కపూర్, జాన్వీ, ఖుషి, అన్షులా కలిసిపోయారు.

శ్రీదేవీ మరణంపై అనుమానాలు:ఇక శ్రీదేవీ విషయానికి వస్తే.. దుబాయ్‌లో జరిగే పెళ్లి కోసం వెళ్లిన ఆమె అక్కడే ప్రమాద వశాత్తూ బ్రాత్రూం టబ్‌లో పడి మరణించారు. ఆమె మరణం భారతీయ సినిమా పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. అయితే ఆమె మరణం సహజ మరణం కాదు. ఏదో జరిగిందనే విషయంపై అనేక అనుమానాలు వచ్చాయి. అయితే శ్రీదేవీ మరణంపై బోని కపూర్ మౌనం వహిస్తూ వచ్చారు.

Is Janhvi Kapoor born to Sridevis before Marriage? Here is Boney Kapoor confirmation

శ్రీదేవీ మరణానికి కారణం అదే..:అయితే తాజాగా బోని కపూర్ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయపెట్టారు. ఆమె అతిగా డైటింగ్ చేయడం వల్లే ఆరోగ్య సమస్యలు, లో బీపీ సమస్యలు వచ్చాయి. చాలాసార్లు ఆమె సృహ తప్పి పడిపోవడం జరిగింది. ఆమె మరణం సహజం కాదు. ప్రమాదవశాత్తూ మరణించారు అని బోని కపూర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. అలాగే పెళ్లికి ముందే జాన్వీ పుట్టిందనే విషయంపై కూడా అనుమానాలను క్లియర్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X