పేరు మార్చుకోబోతున్న తారక్.. అతడు ఎన్టీఆర్ కి మరో తలనొప్పే తెచ్చాడా?
తెలుగు చలన చిత్రం దగ్గర మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోస్ లో యంగ్ టైగర్ అనే ట్యాగ్ నుంచి పాన్ ఇండియా వైడ్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ మారిపోయాడు. ఇలా ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న చిత్రాలు చేయనున్న సినిమాలపై మంచి బజ్ ని తాను తెచ్చుకున్నాడు. కాగా ఎన్టీఆర్ విషయంలో ఇటీవ కొన్ని అంశాలు సినీ వర్గాల్లో వైరల్ గా మారుతూ వస్తుండగా వీటిలో తాజాగా మరో ఊహించని అంశం అయితే వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది.
మరి నందమూరి కుటుంబానికి తెలుగు సినిమా దగ్గర ఎలాంటి హిస్టరీ ఉందో తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్(నందమూరి తారక రామారావు) తెలుగు సినిమా దగ్గర నందమూరి కుటుంబానికి ఒక ట్రేడ్ మార్క్ ని సెట్ చేసి వెళ్లిపోయారు. అయితే తారక్ విషయంలో ఎప్పుడు కూడా పలు వార్తలు తన కుటుంబం సంబంధించి వినిపిస్తూ వస్తుంటాయి.

కుటుంబం నుంచి ఎన్టీఆర్ దూరంగా ఉంటాడు అని లేదు ఉంచుతున్నారు అంటూ చాలానే వినిపిస్తూ వచ్చేవి.. కానీ ఒక్కటి మాత్రం నందమూరి అభిమానులు టాక్ విషయంలో ఒప్పుకుంటారు. తాత సీనియర్ ఎన్టీఆర్ పోలికలు ఇతనికి వచ్చాయి అని అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంటూ పిలుచుకుంటారు. అలాగే తనకి కూడా నందమూరి తారక రామారావు అంటూ పేరుని కూడా తాతే పెట్టారు అంటూ ఎన్టీఆర్ కూడా చెప్పుకున్న సందర్భాలున్నాయి.
సరిగ్గా ఇదే పేరుపై రీసెంట్ గా ఒక ఊహించని కాంట్రవర్సీ తెలుగు సినిమాలో మొదలైంది. దెబ్బతో ఎన్టీఆర్ ఇప్పుడు తన ప్రొఫైల్ టైటిల్ పేరులో "జూనియర్ ఎన్టీఆర్" అనే పేరుని తొలగించుకుంటున్నాడు అని కొన్ని పుకార్లు మొదలయ్యాయి. అయితే అసలు ఈ పుకార్లు అంతా ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి ఇచ్చిన స్ట్రోక్ మూలానే అంటూ కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా వైవిఎస్ "ఎన్టీఆర్" పేరు మీద చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ కి తారక రామారావు అని పేరు పెట్టింది సీనియర్ ఎన్టీఆర్ కాదని చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పైగా తాను తన కొత్త సినిమాని సీనియర్ ఎన్టీఆర్ ముని మనవడు ఎన్టీఆర్ తో చేస్తూ అతన్ని వెండితెరకి పరిచయం చేస్తున్నాను అని తెలిపాడు.

దీనితో ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ పేరుతో కూడా జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద తలనొప్పి మొదలైంది. అలాగని తన కుటుంబంలో వాళ్ళతోనే గొడవలు పెట్టుకోలేడు. అందుకే కీలక నిర్ణయం తాను తీసుకున్నట్టుగా ఇప్పుడు వార్తలు మొదలయ్యాయి. దీనితో తన పేరుని జూనియర్ ఎన్టీఆర్ నుంచి మిస్టర్ ఎన్టీఆర్ గా మార్చుకోనున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
దీనితో ఇప్పుడు ఈ వార్తలు తారక్ ఫ్యాన్స్ కి షాకింగ్ గా మారాయని చెప్పాలి. మరి తారక్ నిజంగానే తన స్క్రీన్ ని నేమ్ ని మారుస్తున్నాడా లేదా అనేది తెలియాలి అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఇక రీసెంట్ గానే ఎన్టీఆర్ తన అవైటెడ్ సినిమా "దేవర" షూటింగ్ ని ఫినిష్ చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 25 న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











