జూనియర్ ఎన్టీఆర్ తగ్గాడా? వార్ 2 మూవీతో నెగ్గాడా?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీపైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఆయన సినిమా జర్నీ.. ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో మొదలు కానున్నది. తన తొలి సినిమానే ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌లో, హృతిక్ రోషన్‌తో కలిసి మల్టీ స్టారర్‌గా రూపొందిన ఈ సినిమాలో బలమైన పాత్రను ఆయన పోషిస్తున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ గురించి జరుగుతున్న సోషల్ మీడియా చర్చకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
వార్ సినిమాకు భారీ సంఖ్యలో ప్రేక్షకుల ఆదరణ ఉంది. ఈ సినిమాకు సీక్వెల్ అనగానే నార్త్‌లోనే కాకుండా సౌత్‌లో కూడా ఆసక్తికరంగా ఎదురు చూడటం మొదలు పెట్టారు.ఇక ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీలో ఎంట్రీ ఇస్తున్నారనే విషయం మరింత క్రేజ్‌ను పెంచింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ మార్కెట్ ఏ రేంజ్‌లో విస్తరించనున్నది? అనే చర్చ మొదలైంది. అయితే వార్ 2 సినిమా టీజర్ మాత్రం అంచనాలు పెంచేలా కనిపించింది.

ఇక వార్ 2 సినిమాకు ముందు దేవర చిత్రానికి నార్త్‌లో రెస్పాన్స్ సానుకూలంగా రావడం ఎన్టీఆర్‌కు కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తున్నది. ఈ సినిమా ద్వారా మరింత నార్త్‌లోకి తన అభిమానులను పెంచుకొనే అవకాశం కనిపిస్తున్నది. హృతిక్ కారణంగా హిందీలో రేంజ్ పెరిగితే.. ఈ సినిమాను ఎన్టీఆర్ తన కరిష్మాతో సౌత్‌లో నలుమూలలకు తీసుకెళ్లగలడనే అభిప్రాయాన్ని సినీ, ప్రేక్షక వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అయితే మల్టీస్టారర్ సినిమా అనగానే హీరోల ఫ్యాన్స్‌కు ఓ రకమైన టెన్షన్ ఉంటుంది. తమ హీరోకు ఏ మేరకు నిడివి ఉంటుంది? అనేది, ఎంత ప్రాధాన్యత ఉంటుంది? అనే కొలతలు మొదలవుతాయి. అయితే వార్ 2 టీజర్ చూసిన తర్వాత ఇది హిందీ సినిమా కావడంతో హృతిక్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనేది స్పష్టంగా కనిపించింది. అయితే ఎన్టీఆర్‌కు కూడా అదే స్థాయిలో లెక్క ఉంటుందా? అనే కంగారు అభిమానుల్లో మొదలైంది.
వార్ 2 సినిమా టీజర్ చూస్తే.. ఎన్టీఆర్‌కు భారీగా బిల్డప్ షాట్స్ ఉన్నాయనే ఫీలింగ్ కలిగించింది. ఆ రేంజ్‌లోనే యంగ్ టైగర్‌కు ఇంపార్టెన్స్ ఇస్తారా? హృతిక్‌కు ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఇచ్చి కీలక సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ను వాడేస్తారా? అనే ప్రశ్న ఆసక్తిని పెంచుతున్నది. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ తన అభిమానులను నెగ్గేలా చేస్తాడా? లేదా తగ్గేలా చేస్తాడా? అనేది వేచి చూడాల్సిందే.
బాలీవుడ్‌లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్'గా నటిస్తున్న ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్‌గా రూపొందుతున్నది. వార్ 2 సినిమా టీజర్‌ను తెలుగు, హిందీ, తమిళంలో ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











