ఆ డిజాస్టర్‌ను జూనియర్ ఎన్టీఆర్ కోరుకొంటున్నారా?
RRR మూవీతో జాతీయ స్థాయితోపాటు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్.. అప్పటి నుంచి మరో సినిమాను రిలీజ్ చేసుకోలేకపోయారు. దేవర చిత్రం
షూటింగ్ పలు కారణాల వాయిదా పడటంతో ఆ సినిమా ఆలస్యం అయింది. ప్రస్తుతం ఆయన దేవర షూటింగుతోపాటు హిందీలో తెరకెక్కుతున్న వార్ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ముంబైలో ఆయనకు మంచి ఆదరణ లభిస్తున్నది. అయితే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. అయితే ఆయన గురించిన ఓ విషయం మీడియాలోను, రాజకీయాల్లోను భారీగా ప్రచారం అవుతున్నది. ఆ విషయం గురించిన వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం హాట్ హాట్‌గా ఉంటే.. ఎన్టీఆర్ మాత్రం తనకేమీ పట్టనట్టు ముంబైలో వార్ షూటింగులో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆలియా, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి పార్టీ చేసుకొన్న వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ముంబైలో ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో ఆ వీడియోలు తెలిపాయి.


అయితే తనకు సన్నిహితులైన నాని, వంశీ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎన్టీఆర్ మనసులో ఉన్న మాటలే ఆ ఇద్దరు చెప్పారా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అదే కోరుకొంటున్నారా? టీడీపీని డిజాస్టర్‌ను ఎన్టీఆర్ నిజంగానే కోరుకొంటున్నారా? అనే అనుమానాలను రాజకీయ, సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలా వ్యూహాత్మంగా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారా? అనే కోణంలో కథనాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, తెలుగుదేశం పార్టీకి చావో రేవోగా మారిన పరిస్థితుల్లో నందమూరి హీరోలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ దూరంగా ఉండటం కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీసేలా ఉంది. నందమూరి కుటుంబంలోని కొందరు సభ్యులు పలు చోట్ల పార్టీ ప్రచారంలో పాలు పంచుకొంటున్నాయి. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రం మౌనంగా ఉంటూ తమ పనేదో చూసుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











