కొరటాల పక్కన సరైన వ్యక్తులుంటే బ్లాక్‌బస్టర్స్.. ఆచార్య డిజాస్టర్‌ను కెలికిన ఎన్టీఆర్!
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత దర్శకుడు కొరటాల శివ నుంచి వస్తున్న చిత్రం దేవర. ఆచార్య ఫ్లాప్ తర్వాత వచ్చిన విమర్శల నేపథ్యంలో దేవర సినిమాను ఎన్టీఆర్‌తో ప్రారంభించారు. అయితే అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ సినిమాను పూర్తి చేసి సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను ముంబైలో ప్రారంభించారు. మంగళవారం (సెప్టెంబర్ 10వ తేదీన) రిలీజ్ అయింది. ఈ సందర్భంగా కొరటాల గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ..
కొరటాల శివ సినిమా కెరీర్‌ను ఫాలో అయినప్పుడు నాకు ఆయనపై ఇంట్రెస్ట్, గౌరవం పెరిగిందే కానీ తగ్గలేదు. ఆయన సినీ పరిశ్రమకు ఇచ్చిన బ్లాక్ బస్టర్ వల్ల ఆయనపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. అలాంటి ఒత్తిడిని తట్టుకొంటూ సినిమాలు తీశాడు. ఆయన మైండ్‌లో ఎప్పుడూ సినిమా తిరుగుతుంటుంది అని ఎన్టీఆర్ అన్నాడు.

కొరటాల శివ ఎప్పుడూ సినిమా కథతోనే ప్రయాణం అవుతుంటాడు. వేరే విషయాలు ఆయన మనసులో ఆలోచనల్లో ఉండవు. ఎప్పుడూ ఆ కథ గురించి, ఆ సినిమాలోని సీన్ల గురించి బుర్ర పెట్టి ఆలోచిస్తాడు. అలాంటి సమయంలో అతడికి సరైన ప్లేస్, సరైన మనుషులు పక్కన ఉంటే చాలూ.. అతడు అద్బుతమైన సినిమాలను అందిస్తాడు అని ఎన్టీఆర్ అన్నాడు.
అయితే ఎన్టీఆర్ చెప్పిన మాటలు.. మెగా అభిమానులకు ఎక్కడో తాకాయి. ఆచార్య ఫలితం గురించే ఆయన ఈ మాటలు అన్నాడు. ఆచార్య ఫ్లాప్ వెనుక ఆయన తప్పేమి లేదు. సరైన వ్యక్తులు లేకపోవడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయిందా? అంటూ పెడార్థాలు తీస్తున్నారు. అయితే ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ మాత్రం కాస్త కఠవుగానే స్పందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ రెస్సాన్స్ వస్తున్నట్టు కనిపిస్తున్నది. దేవర సినిమాపై టీడీపీ అభిమానులు మాత్రం ట్రోలింగ్ మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో అప్పడే వ్యతిరేక ప్రచారం మొదలైంది. ఈ సినిమా రిలీజ్ వరకు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











