Kalki 2898 AD: రిలీజ్‌కు ముందు ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. కల్కి షోలు అక్కడ క్యాన్సిల్!
పాన్ ఇండియా సినిమా మార్కెట్ దగ్గర తనకంటూ ఒక స్పెషల్ మార్కెట్ ని సెట్ చేస్తున్న మొట్ట మొదటి టాలీవుడ్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా రెబల్ స్టార్ హీరో ప్రభాస్ అనే చెప్పుకోవాలి. మరి గడిచిన రెండేళ్లలో మూడు సినిమాలతో ఆల్రెడీ పలకరించిన డార్లింగ్ ఈ రెండేళ్లలోనే నాలుగో సినిమాతో రాబోతున్నాడు. కాగా ఈ నాలుగో సినిమానే "కల్కి 2898 ఎడి".
అయితే ఈ సినిమా భారీ స్థాయిలో అంచనాలు సెట్ చేసుకొని ఇంకొన్ని గంటల్లో థియేటర్స్ లో పడిపోతుంది. దీనితో ఈ యుఫోరియా అంతా ఇండియా వైడ్ గా కొనసాగుతుంది. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమా ప్రపంచ వ్యప్తాంగాక చాలా చోట్ల వీలైనంత గ్రాండ్ రిలీజ్ చేసేలా సన్నాహాలు చేసి కంటెంట్ ని కూడా సిద్ధం చేసుకున్నారు.

కానీ ఇంత ప్లానింగ్ చేసినప్పటికీ రిలీజ్ కి ముందు మాత్రం సినిమాని అనుకున్నట్టుగా రిలీజ్ చేయడంలో విఫలం అయ్యారని చెప్పాలి. మొదట ఈ సినిమాని అనౌన్స్ చేసినపుడు వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ అన్నట్టుగా తెలిపారు కానీ ఇది కాస్త పాన్ ఇండియా భాషల్లో వస్తుంది. పోనీ ఈ భాషల్లో అయినా కూడా చెప్పిన అన్ని ఫార్మాట్ లలో కూడా మేకర్స్ ఇప్పుడు ప్రాపర్ రిలీజ్ చేయలేకపోయారు.
ఈ సినిమాని ఏ ఇండియన్ సినిమా కూడా చేయని రీతిలో ఓవర్సీస్ మార్కెట్ లో ఐమాక్స్ వెర్షన్ ని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ చిత్రం యూఎస్ సంబంధిత నగరాల్లో రిలీజ్ ఆగిపోయిందట. దాదాపు 15 కి పైగా ఐమాక్స్ స్క్రీన్ లలో కల్కి సినిమాని పలు కారణాలు చేత ఆపేసారు అని తెలుస్తుంది. ఇక దీనితో పాటుగా మేకర్స్ 4డిఎక్స్ వెర్షన్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

అయితే ఇది ఓవర్సీస్ మార్కెట్ లో రిలీజ్ అవుతుంది కానీ మన ఇండియాలో మాత్రం అవుతున్నట్టుగా ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడో ఎందుకు హైదరాబాద్ లో కూడా 4డిఎక్స్ స్క్రీన్స్ ఉన్నప్పటికీ ఈ వెర్షన్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు. మరి సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు అన్నీ సరిగ్గా రిలీజ్ కి ముందు లేవనెత్తడం షాకింగ్ అని చెప్పాలి.
కాగా ఈ భారీ చిత్రంలో అనేకమంది బిగ్ స్టార్స్ నటిస్తున్నారు. ఉలగనయగన్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, దీపికా పదుకొనె, మాళవిక నాయర్ ఇంకా రూమర్స్ ప్రకారం మృణాల్ ఠాకూర్, నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు కూడా నటిస్తున్నారని కొన్ని రూమర్స్ ఉన్నాయి. మరి ఈ పరంగా అయితే సినిమాపై అందరిలో మంచి ఆసక్తి నెలకొంది. ఇంకా ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











