మహేష్ బాబు వల్లే కృష్ణ మరణం.. జాతకం చెప్పిన వేణుస్వామిపై నెటిజన్లు దాడి
తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి వేణుస్వామి చెప్పే జాతకాలు అత్యంత దిగ్బ్రాంతికరంగా ఉంటాయి. ఆయన జాతకాలు అనేక రకాలుగా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆయన చెప్పే జ్యోతిష్యం గురించి ఫిర్యాదు చేస్తూ కోర్టులను, మహిళా కమిషన్‌లో కేసులు నమోదయ్యాయి. అయినా తన తరహా జాతకాలను చెప్పడం మానడం లేదనే వాదన వినిపిస్తున్నది. గతంలో వేణు స్వామి చెప్పిన మహేష్ బాబు ఓ జాతకం తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
1995 సంవత్సరం నుంచి కృష్ణ గారి ఇంట్లో పూజలు చేస్తున్నాను. అలాంటి నన్ను వాళ్లింట్లో పూజలకు పిలువడం మానేశారు. ఎందుకంటే.. జాతక రీత్యా ఏది అనిపించినా నేను మరోమాట లేకుండా చెప్పడమే అందుకు కారణం. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల వారు తమ ఇంటికి పూజలకు పిలువలేదు అని వేణుస్వామి ఓ సందర్భంగా మీడియాతో పంచుకొన్నారు.

విజయనిర్మల ఇంట్లో పూజలు చేయడానికి వెళ్తుంటాను. ఆ సమయంలో ఎలా ఉంది జాతకం అని ఆమె నన్ను అడిగారు. అయితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పడం, మాట్లాడటం అలవాటు కాబట్టి.. నేను వాస్తవం చెప్పేందుకు ప్రయత్నించా. 2020 సంవత్సరం తర్వాత మీ ఇంట్లో మరణాలు ఉంటాయి అని చెప్పాను. దాంతో వారు షాక్ తిన్నారని వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నేను ఏదైతే 2020 తర్వాత డెత్స్ ఉంటాయని చెప్పానో.. వెంటనే నరేష్ వచ్చి మీరు ఎందుకు అలా చెప్పారు. అమ్మ గురించి తెలుసుగా? అమ్మ ఆరోగ్యం గురించి తెలిసి కూడా ఎందుకు చెప్పారు. ఇప్పుడు ఆమె భయాందోళనలకు గురి అవుతారని అన్నారు. నేను వాళ్లింట్లో సంభవించే మరణాల గురించి చెప్పడం వల్ల వారి ఇంట్లో పూజలకు పిలవడం మానేశారు అని వేణు స్వామి ఆ విషయాన్ని పంచుకొన్నారు.
మహేశ్ బాబు గ్రహ రాశి సింహరాశి. నేను జాతకం చెప్పిన ఆ సమయంలో మహేశ్ బాబు జాతకంలో శని గ్రహం మారుతున్నది. దాని ఎఫెక్ట్ కూడా తల్లిదండ్రుల జాతకంపై పడింది. జనవరి 16 తర్వాత వాళ్లింట్లో తల్లిదండ్రులకు ఏదో ఒక చెడు జరుగుతుందని నేను గ్రహించాను. మహేశ్ బాబు గ్రహ స్థితి వల్లే కృష్ణ గారు చనిపోయారని మనం భావించవచ్చు అని వేణు స్వామి చెప్పారు.
ఇదిలా ఉండగా, ఇటీవల వేణుస్వామి మరో బాంబు పేల్చాడు. సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్‌లు సూసైడ్ చేసుకొనే ప్రమాదం ఉంది అని సంచలనం రేపాడు. ఆయన జ్యోతిష్యాలపై నెటిజన్లు, సినీ అభిమానులు భగ్గుమన్నారు. ఇలాంటి జ్యోతిష్యం చెప్పడం ఈయనకే చెల్లుబాటు అవుతుంది. ఇలా సినీ తారల బతుకులపై సంచలన వ్యాఖ్యలు చేయడం తప్పు అని ఆయనను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











